Ram Charan : వరల్డ్ కప్ ఫైనల్.. ఉపాసనతో రామ్ చరణ్ స్పెషల్ పిక్..

వరల్డ్ కప్ ఫైనల్ సందర్బంగా ఉపాసనతో రామ్ చరణ్ స్పెషల్ పిక్.

Ram Charan : వరల్డ్ కప్ ఫైనల్.. ఉపాసనతో రామ్ చరణ్ స్పెషల్ పిక్..

Upasana indian jersey pic with Ram Charan gone viral

Updated On : November 19, 2023 / 8:16 PM IST

Ram Charan : దేశమంతటా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంది. ఏమవుతుందా అని ప్రతిఒక్కరు మ్యాచ్ ని వీక్షిస్తూ కూర్చున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ తుది పోరుకి అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియం వేదిక అయ్యింది. ఈ మ్యాచ్ ని ప్రత్యేక్షంగా చూసేందుకు పలువురు తారలు అహ్మ‌దాబాద్‌ చేరుకోగా, కొందరు మాత్రం ఇంటిలోని కూర్చొని మ్యాచ్ ని వీక్షిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ సందర్బంగా పలువురు తారలు ఇండియన్ జెర్సీలో ఫోటోలు దిగి షేర్ చేస్తున్నారు.

ఈక్రమంలోనే వరుణ్ తేజ్ ఒక వీడియోని షేర్ చేశారు. ఇక రామ్ చరణ్ సిస్టర్ సుష్మిత కొణిదెల ఆమె ఇన్‌స్టా స్టోరీలో ఒక ఫోటో షేర్ చేస్తూ.. “వరల్డ్ కప్ ని గెలుచుకు రండి టీం” అంటూ రాసుకొచ్చారు. కాగా పోస్టు చేసిన ఆ పిక్ లో రామ్ చరణ్ పేరు ఉన్న జెర్సీని ఉపాసన ధరించి కనిపిస్తుంటే, ఆమె పక్కనే చరణ్ థంబ్స్ అప్ చూపిస్తూ కనిపిస్తున్నారు. ఈ పిక్ చాలా లవ్లీ కనిపించడంతో అభిమానులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Also read : Vaishnav Tej : ఆ నటితో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో

Upasana indian jersey pic with Ram Charan gone viral

ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఆల్మోస్ట్ వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి లోపు సినిమా షూటింగ్ ని పూర్తి చేయనున్నారట. మార్చి నుంచి RC16 మూవీని మొదలు పెట్టనున్నారని టాక్ వినిపిస్తుంది. బుచ్చిబాబు డైరెక్ట్ చేయబోతున్న ఈ RC16 లో చరణ్ కి జోడిగా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఫేవరెట్ యాక్ట్రెస్ సాయి పల్లవి. రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరోయిన్ తో కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. మరి ఈ వార్త నిజమవుతుందో లేదో చూడాలి.