Upasana : గవర్నర్ తమిళిసైకి ఉపాసన కృతజ్ఞతలు.. ‘మా మావయ్య కూల్’ అంటూ పోస్ట్..

ఆ విషయం కృతజ్ఞతలు తెలియజేయడం కోసం గవర్నర్ తమిళిసైని కలుసుకున్న ఉపాసన. అలాగే మా మావయ్య కూల్ అంటూ చిరంజీవి గురించి..

Upasana : గవర్నర్ తమిళిసైకి ఉపాసన కృతజ్ఞతలు.. ‘మా మావయ్య కూల్’ అంటూ పోస్ట్..

Upasana post on Chirnajeevi and Tamilisai Soundararajan gone viral

Updated On : February 6, 2024 / 6:55 PM IST

Upasana : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆమెకు కుటుంబ విషయాలను షేర్ చేయడంతో పాటు, సామాజిక బాధ్యతకి సంబంధించిన పోస్టులు కూడా వేస్తూ ఫిలాన్తరోపిస్ట్ గా మంచి పేరుని సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఈమె తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలుసుకున్నారు. అందుకు సంబందించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసారు.

‘గిరిజన సంక్షేమం’ కోసం ఉపాసన శ్రమిస్తూ ఉంటారని అందరికి తెలిసిందే. వారి కోసం ఉపాసన పలు సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇటీవల తమ గారాలపట్టి ‘క్లీంకార’ నామకరణం వేడుకను కూడా ఆ గిరిజన పద్దతిలో నిర్వహించి.. చాలామందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు ఆ గిరిజనల సంక్షేమం విషయంలో.. ‘గవర్నర్ తమిళిసై చేసిన పనులు తన గుండెకు హత్తుకున్నాయి’ అంటూ ఉపాసన పేర్కొన్నారు.

Also read : Pushpa 2 : పుష్ప కోసం బెయిల్ మీద వచ్చిన కేశవ.. షూటింగ్స్‌లో పాల్గొంటున్న నటుడు..

ఆ విషయంలో ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయడం కోసం.. ఉపాసన రీసెంట్ గా తమిళిసైని కలుసుకున్నారు. తమిళిసైకి కృతజ్ఞతలు తెలియజేసిన ఉపాసన.. సీతారామ లక్ష్మణ ఆంజనేయ ప్రతిమలను బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

ఇక అలాగే తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి పోస్టు చేసిన కొత్త వీడియో పై రియాక్ట్ అవుతూ కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చేశారు. చిరంజీవి తాను నటించేబోయే కొత్త సినిమా ‘విశ్వంభర’ కోసం జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోని చిరు నేడు అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ వీడియోని ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘మా మావయ్య కూల్’ అంటూ పేర్కొన్నారు.

Upasana post on Chirnajeevi and Tamilisai Soundararajan gone viral