Veerasimha Reddy: వీరసింహారెడ్డి నుండి ఈసారి వచ్చే అప్డేట్ ఏమిటో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో అలరించేందుకు రెడీ అయ్యాడు.

Veerasimha Reddy: వీరసింహారెడ్డి నుండి ఈసారి వచ్చే అప్డేట్ ఏమిటో తెలుసా..?

Update On Shruti Haasan From Veerasimha Reddy To Be Revealed Soon

Updated On : December 5, 2022 / 6:20 PM IST

Veerasimha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో అలరించేందుకు రెడీ అయ్యాడు.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఆగమనం ఆ రోజే..!

కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ శ్రుతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యతో తొలిసారి జోడీ కట్టింది ఈ బ్యూటీ. వీరసింహారెడ్డి సినిమా నుండి వచ్చిన బాలయ్య ఫస్ట్ లుక్‌తో పాటు వీరసింహారెడ్డి టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వీటికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో, ఇప్పుడు మరో అప్డేట్‌ను ఇచ్చేందుకు వీరిసింహారెడ్డి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Waltair Veerayya: మాస్ ఇంట్రోను రెడీ చేస్తున్న వాల్తేరు వీరయ్య..?

అయితే ఈసారి హీరోయిన్ శ్రుతి హాసన్ గురించిన అప్డేట్ రానున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. శ్రుతి హాసన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి శ్రుతి హాసన్ గురించి రాబోయే ఈ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించడంతో, ఈ సినిమా ఎలాటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.