Urvashi Rautela: మెడపై ప్రేమ గాటు మరక?.. ఊర్వశీ ఆగ్రహం!

సినీ సెలబ్రిటీలు అడుగు బయటపెడితే వంద కెమెరా కళ్ళు వాళ్ళని ఫాలో చేస్తుంటాయి. వాళ్ళేం బట్టలు వేసుకున్నారు

Urvashi Rautela: మెడపై ప్రేమ గాటు మరక?.. ఊర్వశీ ఆగ్రహం!

Urvashi Rautela

Updated On : February 24, 2022 / 8:03 AM IST

Urvashi Rautela: సినీ సెలబ్రిటీలు అడుగు బయటపెడితే వంద కెమెరా కళ్ళు వాళ్ళని ఫాలో చేస్తుంటాయి. వాళ్ళేం బట్టలు వేసుకున్నారు.. ఎలాంటి అద్దాలు పెట్టుకున్నారు.. దాని ఖరీదు ఎంత.. ఎక్కడకెళ్తున్నారు.. ఏం తింటారు ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారన్నది కెమెరా కళ్ళు వాళ్ళ అభిమానులకు చూపిస్తుంటాయి. అందుకే వాళ్ళు కూడా అడుగు బయటపెట్టేముందు అన్నీ సరిగ్గా చూసుకొనే వస్తుంటారు. అయితే అప్పుడప్పుడు తప్పటడుగులు పడడం.. ట్రోల్స్ కూడా కామనే.

Bollywood Heroins: రెమ్యునరేషన్ డిమాండ్.. చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్!

కాగా.. తాజా ఫొటోల్లో బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ ఊర్వశి రౌతేలా మెడ మీద ఎర్రటి మరక ఒకటి కనిపించింది. దానికి ఓ వెబ్‌సైట్‌ హద్దులు దాటి ఊర్వశి మెడపై లవ్‌ బైట్‌ అంటూ రాసేసింది. ఇది ఊర్వశి కంట్లో కూడా పడింది. అంతే ఆగ్రహించిన ఊర్వశి సదరు కథనానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Bollywood Heroins: హాట్ సీన్స్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్ స్టార్ వైఫ్స్!

అది లవ్ బైట్ కాదు.. నా రెడ్‌ లిప్‌స్టిక్‌, మాస్క్‌ తీస్తూ అది నా మెడకు అంటింది. పెదాలకు రెడ్‌ లిప్‌స్టిక్‌ పెట్టుకున్న తర్వాత దాన్ని మెయింటెన్‌ చేయడం ఎంత కష్టమో ఏ అమ్మాయిని అడిగినా చెప్తుంది. హాస్యాస్పదంగా ఉంది. ఒకరి ప్రతిష్టను దిగజార్చడం కోసం ఏదిపడితే అది రాస్తారా? ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లు రాసే బదులు నా విజయాల గురించి రాయొచ్చు కదా?, అసత్య ప్రచారం చేసినందుకుగానూ తనకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ ట్వీట్ చేసింది.