Pawan Kalyan: న్యూస్ ఇయర్ కి వచ్చేస్తోంది.. పవన్ ఫ్యాన్స్ అంతకుమించి చేస్తారా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. (Pawan Kalyan0ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు. కానీ, హీరోలని ఫ్యాన్స్ గా ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. రీసెంట్ గా వచ్చిన ఓజీ సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది.
Ustad Bhagat Singh's first song to be released for the New Year
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు. కానీ, హీరోలని ఫ్యాన్స్ గా ఉన్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. రీసెంట్ గా వచ్చిన ఓజీ సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా(Pawan Kalyan) పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది. రీజనల్ మూవీగా రిలీజైన మొదటిరోజు ఏకంగా రూ.154 కోట్లు కొల్లగొట్టగా లాంగ్ రన్ లో ఏకంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇటీవలే ఓటీటీకి వచ్చిన ఈ సినిమా అక్కడ కూడా ఒక రేంజ్ సత్తాచాటుతోంది.
ఇక ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అదే రేంజ్ లో సినిమాను కూడా సెట్ చేస్తున్నాడు హరిశ్ శంకర్. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెంచేసింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందట.
అయితే, అంతకన్నా ముందే తన ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నాడట పవన్ కళ్యాణ్. అదేంటంటే, న్యూ ఇయర్ సందర్బంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సింగ్ ను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట హరీష్ శంకర్. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్- దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల పాటలు ఏ రేంజ్ లో ఉర్రుతలూగించాయో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ఇప్పుడు మరోసారి అదే రేంజ్ లో పాటలను అందించాడట దేవి. ఈ ఒక్క పాటతో సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లనున్నారట మేకర్స్. మరి భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి పాటను పవన్ ఫ్యాన్స్ ఓజీకి మించి సెలబ్రేట్ చేసుకుంటారా అనేది చూడాలి.
