Vaaradhi : ‘వారధి’ మూవీ సెన్సార్ పూర్తి..
అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా నటించిన చిత్రం వారధి

Vaaradhi Movie Censor complete
అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా నటించిన చిత్రం వారధి. శ్రీకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై పెయ్యాల భారతి, ఎండి యూనస్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్ పుల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంది. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథలో లవ్, రొమాన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఈ చిత్రం తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు.
Mohan Babu : కొట్టడం తప్పే..! మరో ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు, కీలక వ్యాఖ్యలు..
Allu Arjun : రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. స్పందించిన టీమ్..
నటీనటుల అభినయం, సాంకేతిక నిపుణుల కృషి కథా కథనాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేసినట్లుగా తెలిపారు.