‘Vaathi Coming’ : వాతి కమింగ్ రికార్డ్.. 180మిలియన్ల వ్యూస్!

ఓ పాట దేశం మొత్తం హల్ చల్ చెయ్యడం అంటే మాటలా? ఇండియా మొత్తాన్ని స్టెప్పులు వేయించేలా చేస్తున్న సాంగ్ 'వాతి కమింగ్' ఇంటర్నెట్ సంచలనంగా మారిన వాతి కమింగ్ పాటను.. ఇప్పటికే 180మిలియన్ల మంది చూసేశారు.

‘Vaathi Coming’ : వాతి కమింగ్ రికార్డ్.. 180మిలియన్ల వ్యూస్!

Vaathi Coming

Updated On : May 28, 2021 / 10:47 AM IST

Vaathi Coming Song: ఓ పాట దేశం మొత్తం హల్ చల్ చెయ్యడం అంటే మాటలా? ఇండియా మొత్తాన్ని స్టెప్పులు వేయించేలా చేస్తున్న సాంగ్ ‘వాతి కమింగ్’ ఇంటర్నెట్ సంచలనంగా మారిన వాతి కమింగ్ పాటను.. ఇప్పటికే 180మిలియన్ల మంది చూసేశారు. త్వరలో ఈ పాట 200మిలయన్ల మంది చూస్తారంటూ.. ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేసింది సోనీ మ్యూజిక్ సౌత్.

యూట్యూబ్‌లో ఈ పాట రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. అనిరుధ్ సంగీతం అందించిన వాతి కమింగ్ పాటలో తమిళ సూపర్ స్టార్ విజయ్ స్టెప్పలు అదిరిపోగా.. సూపర్ ఫేమస్ అయ్యాయి. ఇప్పటివరకు(ఈ ఆర్టికల్ రాసే సమయానికి) ఈ పాట 181,263,316 వ్యూస్ సాధించింది. విజయ్, మాళవిక మోహనన్ జంటగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమా కరోనా ఉపశమనం ఇచ్చిన జనవరిలో సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది.

కరోనా మహమ్మారి సమయంలో కూడా 100 కోట్ల సినిమాగా నిలిచింది మాస్టర్. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అనిరుధ్ రవిచంద్ర సినిమాకు మ్యూజిక్ అందించారు. వాతి కమింగ్ అప్ లోడ్ చేసిన కేవలం 30 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ దాటేయగా ఈ పాటకు 2.1 మిలియన్ లైకులు వచ్చాయి.