Varalaxmi Sarathkumar : ఆ డ్రగ్స్ కేసులో ఉన్నది నేను కాదు.. క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మి..
డ్రగ్స్ కేసులో తనకి అధికారులు నోటీసులు పంపారు అనే వార్తలు పై వరలక్ష్మి సమాధానం ఏంటంటే..?

Varalaxmi Sarathkumar comments on facing calls from nia officers in drugs case
Varalaxmi Sarathkumar : సీనియర్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి ‘వరలక్ష్మి’. సినిమాలో మెయిన్ రోల్స్, విలన్ పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కాగా ఇటీవల ఈ నటికి డ్రగ్స్ కేసులో కొచ్చి ఎన్ఐఏ అధికారులు సమన్లు పంపించి నాట్లు వార్తలు వినిపించాయి. వరలక్ష్మికి పీఏగా పని చేసిన ఆదిలింగం.. డ్రగ్స్ కేసులో కీలక నిందితులలో ఒకరుగా నిలిచాడు. డ్రగ్స్ స్మగ్లర్‌లతో అదిలింగంకు సంబంధాలు ఉన్నాయంటూ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Mansion 24 Trailer : భయపెట్టడానికి వస్తున్న వరలక్ష్మి.. మ్యాన్షన్ 24 గది రహస్యం ఏంటి..?
ఇక ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు విచారించడం కోసం వరలక్ష్మికి కూడా సమన్లు పంపించినట్లు అప్పటిలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై వరలక్ష్మి తాజాగా ఒక క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్న వరలక్ష్మిని ఈ విషయం గురించి ప్రశ్నించారు. దానికి బదులిస్తూ.. “ఆ కేసుకి నాకు ఏ సంబంధం లేదు. నాకు పోలీసులు ఎటువంటి సమన్లు పంపించలేదు. నాకు ఎటువంటి ఫోన్ కూడా చేయలేదు. అతను నా మేనేజర్ కాబట్టి న్యూస్ వైరల్ అవ్వడం కోసం నా పేరుని వాడుకున్నారు” అంటూ తెలియజేసింది.
“విజయ్ ‘సర్కార్’ మూవీ నాకు తీసుకు వచ్చింది ఆ మేనేజర్. అప్పుడే నాకు పరిచయం. ఆ తరువాత నాకు ఫ్రీ లాన్స్ మేనేజర్ గా కొన్ని సినిమాలకు వర్క్ చేశారు. ప్రొఫెషనల్ వరకు జరిగింది అంతే.. ఆయన పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా” అంటూ చెప్పుకొచ్చింది. కాగా వరలక్ష్మి ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు ఓంకార్ దర్శకత్వంలో ‘మాన్షన్ 24’ అనే హారర్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా నేడు ఈ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లోనే వరలక్ష్మి డ్రగ్స్ కేసు విషయం పై క్లారిటీ ఇచ్చింది.