Varalaxmi Sarathkumar : ఇండస్ట్రీకి దొరికిన లేడీ విలన్.. అప్పుడే 50 సినిమాలు పూర్తి చేసేసిన వరలక్ష్మి..

ఓ పక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా రావడంతో చేసింది. హీరోయిన్ గా కంటే నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా సక్సెస్ అవ్వడం, బాగా పేరు రావడంతో హీరోయిన్ గా తగ్గించేసి వాటికే ఫిక్స్ అయిపోయింది వరలక్ష్మి.

Varalaxmi Sarathkumar : ఇండస్ట్రీకి దొరికిన లేడీ విలన్.. అప్పుడే 50 సినిమాలు పూర్తి చేసేసిన వరలక్ష్మి..

Varalaxmi Sarathkumar completed 50 movies in just 10 years

Updated On : July 18, 2023 / 10:00 AM IST

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ టాప్ మోస్ట్ యాక్టర్. లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంది. తమిళ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో పొడా పోడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి. ఓ పక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా రావడంతో చేసింది. హీరోయిన్ గా కంటే నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా సక్సెస్ అవ్వడం, బాగా పేరు రావడంతో హీరోయిన్ గా తగ్గించేసి వాటికే ఫిక్స్ అయిపోయింది వరలక్ష్మి.

వరుసగా తమిళ్, మలయాళంలో సినిమాలు చేస్తూ తెలుగులో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక క్రాక్ సినిమాతో లేడీ విలన్ గా అదరగొట్టి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఇటీవలే వీరసింహ రెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా కూడా అలరించింది. ప్రస్తుతం సౌత్ లో అన్ని భాషల్లో వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తుండటంతో త్వరలోనే అక్కడ కూడా ఎంట్రీ ఇవ్వనుంది.

Vijay Devarakonda : లైగర్ తర్వాత విజయ్ మారిపోయాడా? బేబీ సక్సెస్ మీట్‌లో విజయ్ స్పీచ్ వైరల్.. యాటిట్యూడ్ పక్కన పెట్టాడా?

తాజాగా తాను 50 సినిమాలు పూర్తి చేశానంటూ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. ఓ సరదా వీడియోని షేర్ చేస్తూ.. 50 సినిమాలు.. నా జర్నీలో భాగం అయిన వారందరికీ ధన్యవాదాలు. ఇది అంత ఈజీ కాదు. ఐ లవ్ యు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికి. మిమ్మల్ని మీరు నమ్మడం ఆపకండి. నాతో పని చేసే వాళ్లందరికి, నా కోసం పనిచేసే వాళ్లందరికి చాలా స్పెషల్ థ్యాంక్స్. ఇంకా చాలా సినిమాలు చేయాలి అంటూ పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలతో కూడా కలిపి 50 సినిమాలు అయినట్టు సమాచారం. ఈ 50 సినిమాలు కేవలం 10 ఏళ్లలోనే చేయడం విశేషం. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ కి అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు.