Baby John : వ‌రుణ్ ధావ‌న్‌ ‘బేబీ జాన్‌’ టీజర్‌ను షేర్‌ చేసిన స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ.. చూశారా?

వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న మూవీ 'బేబీ జాన్‌'.

Baby John : వ‌రుణ్ ధావ‌న్‌ ‘బేబీ జాన్‌’ టీజర్‌ను షేర్‌ చేసిన స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ.. చూశారా?

Baby John Teaser

Updated On : November 4, 2024 / 12:39 PM IST

Baby John : వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న మూవీ ‘బేబీ జాన్‌’. వామికా గబ్బి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రం కాలీస్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోంది. మురాద్‌ ఖేతానీ, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల‌ ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది.

అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ చేతుల మీదుగా విడుద‌లైంది. టీజ‌ర్ అదిరిపోయింది. త‌మ‌న్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓ లెవ‌ల్‌లో ఉంది.

Ka Movie : బాక్సాఫీస్ వ‌ద్ద ‘ క ‘ దూకుడు.. నాలుగు రోజుల కలెక్షన్స్.. ఎంతంటే..

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త‌మిళ స్టార్ హీరో న‌టించిన తెరి మూవీకి రీమేక్‌. త‌మిళ నాట ఘ‌న విజ‌యాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పోలీసోడ్ పేరుతో తెలుగులో విడుద‌ల చేయ‌గా ఇక్కడా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అత‌డి శిష్యుడు కాలీస్ బాలీవుడ్‌లో రీమేక్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ సినిమా బాలీవుడ్‌లో ఎన్ని సంచ‌నాలు సృష్టిస్తుందో చూడాలి మ‌రి.