Ka Movie : బాక్సాఫీస్ వ‌ద్ద ‘ క ‘ దూకుడు.. నాలుగు రోజుల కలెక్షన్స్.. ఎంతంటే..

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన మూవీ 'క'.

Ka Movie : బాక్సాఫీస్ వ‌ద్ద ‘ క ‘ దూకుడు.. నాలుగు రోజుల కలెక్షన్స్.. ఎంతంటే..

Kiran Abbavaram Ka Movie four Days Collections

Updated On : November 4, 2024 / 12:21 PM IST

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన మూవీ ‘క’. దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వ‌ద్ద తొలి రోజు నుంచే భారీ వ‌సూళ్లను అందుకుంటోంది.

ఈ చిత్రం విడుద‌లైన నాలుగు రోజుల్లోనే 26.52 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను క‌లెక్ట్ చేసింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Actress Kasthuri: తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి.. విమర్శలు రావడంతో..

కాగా.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ఈ చిత్రం పై మొద‌టి నుంచి కిర‌ణ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే హిట్‌ను అందుకున్నాడు.

క చిత్రానికి సుజీత్‌-సందీప్‌లు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తన్వీ రామ్, నయన్ సారిక లు క‌థానాయిక‌లు న‌టించారు. చింతా గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుంద‌ని ఇప్పటికే చెప్పారు. అందులో పార్ట్ వ‌న్‌కి మించి ట్విస్ట్‌లు ఉంటాయ‌న్నారు.

Shreya Ghoshal : హైదరాబాద్ లో శ్రేయ ఘోషాల్ మ్యూజికల్ నైట్.. ఎక్కడ.. ఎప్పుడంటే..