Nindha Teaser : వరుణ్ సందేశ్ ‘నింద’ టీజర్ చూశారా? ఈసారి వరుణ్ సందేశ్ హిట్ కొట్టేలాగే ఉన్నాడు..
వరుణ్ సందేశ్ ఇప్పుడు 'నింద' అనే మర్డర్ మిస్టరీ సినిమాతో రాబోతున్నాడు.
Varun Sandesh Nindha Movie Teaser Released
Nindha Teaser : హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో వరుణ్ సందేశ్ బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలతో మెప్పించినా కొన్ని పరాజయాలు పాలవడంతో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు వరుణ్ సందేశ్. మళ్ళీ బిగ్ బాస్ లో పాల్గొని బయటకి వచ్చాక సినిమాల మీద ఫోకస్ చేసి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు.
Also Read : Alaya F : మా నాన్న రెండో పెళ్ళికి కూడా మా అమ్మ వెళ్ళింది.. పేరెంట్స్ పై బాలీవుడ్ భామ ఆసక్తికర వ్యాఖ్యలు..
వరుణ్ సందేశ్ ఇప్పుడు ‘నింద’ అనే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం నిర్మాతగా, దర్శకుడిగా ఈ నింద సినిమా తెరకెక్కిస్తున్నారు. నింద టైటిల్ కి కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ ఇచ్చారు. తాజాగా నింద టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. ‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు..’ అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్ టీజర్ ఆసక్తిగా ఉంది. ఈ సినిమాతో అయినా వరుణ్ మంచి హిట్ కొడతాడని భావిస్తున్నారు. మీరు కూడా నింద టీజర్ చూసేయండి..
https://www.youtube.com/watch?v=rkWBtUwmxjs
ఇక ఈ టీజర్ ని నటుడు నవీన్ చంద్ర రిలీజ్ చేసాడు. ఈ సినిమాలో ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, శ్రేయా రాణి రెడ్డి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

