Varun Tej Lavanya Tripathi Wedding : మూడు ముళ్లు, ఏడు అడుగులు.. వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్, లావణ్య.. పెళ్లి ఫోటో వైరల్
పెళ్లి తంతు ముగిశాక ఇద్దరూ దేవుడికి నమస్కరించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. Varun Tej Lavanya Tripathi Wedding

Varun Tej Lavanya Tripathi Wedding
Varun Tej and Lavanya Tripathi Wedding : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచారు. దాంతో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. పెళ్లి తంతు ముగిశాక ఇద్దరూ దేవుడికి నమస్కరించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వరుణ్ లవ్ జంటకు అంతా శభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
వేద మంత్రాల సాక్షిగా బుధవారం రాత్రి(నవంబర్ 1) ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు సహా టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వరుణ్ లవ్ పెళ్లిలో రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్ తదితర సెలబ్రిటీ కపుల్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
Also Read : వరుణ్, లావణ్య పెళ్ళి వీడియోలు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా..
వరుణ్ తేజ్, లావణ్య మిస్టర్ సినిమాలో జంటగా నటించారు. 2017లో ఈ సినిమా విడుదలైంది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం మొదలైంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటలీలో జరుపుకుంది. అక్కడ వీరి ప్రేమకు బీజం పడింది. తర్వాత అంతరిక్షంలోనూ వీరు కలిసి నటించారు. ఈ సినిమాతో మరింత దగ్గరయ్యారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.
Also Read : వరుణ్ లావణ్యల పెళ్లి.. పవన్ పై వచ్చే మీమ్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Your blessings are earnestly sought for the newly married couple, Varun Tej Konidela and Lavanya Konidela.@IAmVarunTej@Itslavanya pic.twitter.com/UZLD8lulr4
— Naga Babu Konidela (@NagaBabuOffl) November 1, 2023