Varun – Lavanya : వరుణ్, లావణ్య శుభలేఖ చూశారా.. మ్యారేజ్, రిసెప్షన్ డేట్ ఎప్పుడంటే..?

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి తేదీ, వేదిక ఎక్కడ అని చాలా రోజులు నుంచి ఒక సస్పెన్స్ నెలకుంది. తాజాగా ఈ విషయాలు లీక్ అయ్యాయి. ఈ పెళ్లి శుభలేఖ నెట్టింట వైరల్ అవుతుంది.

Varun – Lavanya : వరుణ్, లావణ్య శుభలేఖ చూశారా.. మ్యారేజ్, రిసెప్షన్ డేట్ ఎప్పుడంటే..?

Varun Tej Lavanya Tripathi marriage card date gone viral

Varun – Lavanya : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఆల్రెడీ మొదలైపోయిన ఈ పెళ్లి సంబరం.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో సందడిగా సాగుతుంది. ఇక పెళ్లి  ఈ శుభలేఖలో వరుణ్ తేజ్.. నాయనమ్మ-తాతయ్యల పేరులతో పాటు పెదనాన్న-బాబాయిలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, అన్నయ్య రామ్ చరణ్ పేరులను ముద్రించారు.

అక్టోబర్ 30 నుంచి ఈ పెళ్లి వేడుక మొదలు కాబోతుంది. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్, లావణ్య కుటుంబసభ్యుల మధ్యన మాత్రమే ఈ వివాహం జరగనుంది. ఆ తరువాత నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారని సమాచారం. ఇక ఇటలీలో జరగబోయే పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రేపు అక్టోబర్ 27న బయలుదేరనున్నారట.

Also read : Vijay Deverakonda : ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ డైలాగ్.. ఐరనే వంఛాలా ఏంటి..?

Varun Tej Lavanya Tripathi marriage card date gone viral

ఇక ఈ పెళ్లి పనులు అన్ని రామ్ చరణ్, ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ఈ పెళ్లి పనుల మీద చరణ్, ఉపాసన ఇటలీ కూడా వెళ్లినట్లు సమాచారం. కాగా ఈ పెళ్ళికి పవన్ కళ్యాణ్ వెళ్తాడా లేదా అనే సందేహం నెలకుంది. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి పవన్ ఇటలీ వరకు వెళ్తాడా అనేది చూడాలి.