Varun Tej: యాక్షన్‌తో నెక్ట్స్ షెడ్యూల్ మొదలెట్టిన వరుణ్ తేజ్
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో ‘గాండీవధారి అర్జున’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది.

Varun Tej Starts Next Schedule Of Gandeevadhari Arjuna With Action Sequence
Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో ‘గాండీవధారి అర్జున’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది.
Varun Tej: తన హీరోయిన్‌ను ఇంట్రొడ్యూస్ చేయనున్న వరుణ్ తేజ్..!
ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్‌ను సోమవారం స్టార్ట్ చేసినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. దీనికి సంబంధించి సెట్స్ నుండి ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ అర్జున్ వర్మ అనే మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లుగా ఈ ఫోటోలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.
Varun Tej : కొత్త మూవీ అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్..
ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన అందాల భామ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోండగా, విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Back in Action with a Thrilling Mission!?
Team #GandeevadhariArjuna kick-starts a new schedule to shoot some blazing high octane action sequences ❤️?@IAmVarunTej @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/xvIA1kHtJC
— SVCC (@SVCCofficial) March 6, 2023