Varun Tej : హనుమాన్ మాల వేసుకున్న వరుణ్ తేజ్.. కొండగట్టు ఆలయంలో పూజలు.. ఫోటోలు వైరల్..

వరుణ్ తేజ్ తాజాగా హనుమాన్ మాల వేసుకున్నారు.

Varun Tej : హనుమాన్ మాల వేసుకున్న వరుణ్ తేజ్.. కొండగట్టు ఆలయంలో పూజలు.. ఫోటోలు వైరల్..

Varun Tej Wears Hanuman Deeksha and went to Kondagattu Temple

Updated On : December 3, 2024 / 3:34 PM IST

Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవలే మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఆశించినంత ఫలితం రాలేదు. ఈ సినిమా తర్వాత కొన్ని రోజులు విదేశాలకు వెకేషన్ వెళ్ళాడు వరుణ్. తాజాగా వెకేషన్ నుంచి తిరిగొచ్చిన వరుణ్ తేజ్ హనుమాన్ మాలలో కనిపించారు.

Also Read : Pushpa 3 – Vijay Deverakonda : పుష్ప 3 గురించి విజయ్ దేవరకొండ ఎప్పుడో చెప్పేశాడుగా.. 2022 ట్వీట్ వైరల్..

వరుణ్ తేజ్ తాజాగా హనుమాన్ మాల వేసుకున్నారు. నేడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. దీంతో వరుణ్ తేజ్ హనుమాన్ మాల వేసుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. మెగా ఫ్యామిలిలో చిరంజీవి, రామ్ చరణ్ రెగ్యులర్ గా అయ్యప్ప మాల వేసుకుంటారని తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా గతంలో మాల వేసుకున్నారు, ఇప్పుడు వరుణ్ తేజ్ హనుమాన్ మాల వేసుకోవడం గమనార్హం.

Varun Tej Wears Hanuman Deeksha and went to Kondagattu Temple

ఇక వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.