Guppedantha Manasu : ఓల్డ్ ఫ్రెండ్స్‌తో గెట్ టుగెదర్ ప్లాన్ చేసిన అనుపమ.. శైలేంద్రకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వసుధర
Guppedantha Manasu Today Episode: అనుపమ తన పాత స్నేహితులతో అలూమిని పెట్టాలనుకుంటున్నట్లు తండ్రి విశ్వనాథంకి చెబుతుంది. మరోవైపు ఫోన్‌లో వసుధర శైలేంద్రకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu
విశ్వనాథంతో అనుపమ తన క్లాస్ మేట్స్‌తో అలూమినీ మీట్ పెట్టాలనుకుంటున్నట్లు చెబుతుంది. అందుకు విశ్వనాథం సరేనంటాడు. మరోవైపు శైలేంద్రకు వసుధర ఫోన్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?
Mukesh Gowda : హీరోగా మారబోతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ రిషి..
కిచెన్‌లో కింద పడిపోయిన జుంకాను తన దగ్గరే పెట్టుకుని వసుధరని ఆటపట్టిస్తాడు రిషి. చివరికి ఇచ్చేస్తాడు. ప్రేమలో తాము చాలా పరీక్షలు ఎదుర్కున్నా ప్రేమ మాత్రం చెక్కు చెదరలేదని వసుధరతో అంటాడు. మన మధ్య దూరం వస్తే భరించలేను అంటాడు. ఇకపై మనకంతా మంచికాలమే అని .. అయితే తన తండ్రి మామూలు మనిషి కావాలని.. తన తల్లి జగతిని చంపిన శత్రువుని పట్టుకోవాలని వసుధరతో చెబుతాడు. మళ్లీ కాలేజీ ఎండీ సీట్లో కూర్చుంటారు కదా అని అడిగిన వసుధరతో నేను ఎప్పటికీ నీ ఎండీనే అంటాడు.
విశ్వనాథం కూతురు అనుపమతో ఇంట్లో అంతా కంఫర్ట్‌గానే ఉందా? అని అడుగుతాడు. తాను ఒక ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నానని.. ఓల్డ్ ఫ్రెండ్స్‌తో అలూమిని చేయాలని అనుకుంటున్నానని అనుపమ విశ్వనాథంకి చెబుతుంది. ఫ్రెండ్స్‌ని చాలా మిస్ అయ్యానని.. అందర్నీ కలిసి అందరి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నానని చెబుతుంది. తప్పకుండా చేయమంటాడు విశ్వనాథం. నువ్వు ఎక్కడ చేయాలనుకున్నా నీ ఇష్టం.. నా ఆస్తిపాస్తులు అన్నీ నీవే కదా అంటాడు. నువ్వు అంగీకరిస్తే అన్ని బాధ్యతలు అప్పగిస్తానని అంటాడు. ఈ మాటలు గతంలో కూడా చెప్పారు కదా డాడీ.. అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనుపమ.

Guppedantha Manasu today
ఏంజెల్, నేను మంచి ఫ్రెండ్స్ కదా.. మా మీద ఎప్పుడైనా నీకు అనుమానం వచ్చిందా? అని వసుధరని అడుగుతాడు రిషి. వసుధరకి కోపం వస్తుంది. విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడే అనుమానం కూడా ఉంటుందని.. వసుధర శిరీష్‌తో చనువుగా ఉన్నప్పుడు తను కూడా అనుమానంతో క్రుంగిపోయానని రిషి లోలోపల అనుకుంటాడు. వసుధరకి సారీ చెప్పినా అలక మానకపోవడంతో శారీ గిఫ్ట్ కొనిస్తా అని బుజ్జగిస్తాడు. సారీ అని గట్టిగా అరుస్తూ ఆటపట్టించడంతో అతని సారీ యాక్సెప్ట్ చేస్తుంది. వారిద్దరి మధ్య అనుబంధం రోజురోజుకి బలపడుతుంది.

Guppedantha Manasu today
పెదనాన్న ఫణీంద్రకి రిషి ఫోన్ చేస్తాడు. తన తండ్రిని కలిసినందుకు థ్యాంక్స్ చెబుతాడు. పరిస్థితులు బాగోక దూరంగా ఉన్నాం కానీ.. నా మనసంతా మీ దగ్గరే ఉంది అంటాడు ఫణీంద్ర. రిషితో మాట్లాడటానికి ఫణీంద్ర నుంచి ఫోన్ తీసుకుంటాడు శైలేంద్ర. తాము వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్లారని ఆరాలు అడుగుతాడు. రిషి ఫోన్‌లో మాట్లాడుతున్నది శైలేంద్రతో అని తెలిసి వసుధర ఫోన్ తీసుకుంటుంది. మీ డాడీ పిలుస్తున్నారని రిషికి చెప్పి ఫోన్ తీసుకుని రిషిని అక్కడి నుంచి పంపిస్తుంది. ఫోన్‌లో శైలేంద్రకి ఫుల్ వార్నింగ్ ఇస్తుంది. రిషితో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నారో తనకి తెలుసునని.. జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవి నేర్చుకోండని కాలేజీ జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తుంది. ముందు మీ భార్య ధరణిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. శైలేంద్ర నుంచి ఫోన్ తీసుకున్న దేవయాని తన భార్యని ఎలా చూసుకోవాలో శైలేంద్రకి తెలుసని.. నువ్వు చెప్పనవసరం లేదని అంటుంది. తోడికోడలు బాధపడుతుంటే తను జోక్యం చేసుకుంటానని.. ఇకపై కూడా కలగజేసుకుంటానని ఫోన్ పెట్టేస్తుంది వసుధర.
Guppedantha Manasu : వసుధరకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రిషి.. ఇద్దరి మధ్య మరింత బలపడిన ప్రేమ బంధం
రోజురోజుకి ఉత్కంఠగా సాగుతున్న’గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.