Ram Karthik : పక్కవాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే క్యారెక్టర్ తో.. ‘వీక్షణం’ గురించి హీరో రామ్ కార్తీక్..

వీక్షణం సినిమా గురించి రామ్ కార్తీక్ మాట్లాడుతూ..

Ram Karthik : పక్కవాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే క్యారెక్టర్ తో.. ‘వీక్షణం’ గురించి హీరో రామ్ కార్తీక్..

Veekshanam Hero Ram Karthik Interesting Comments about Movie

Updated On : October 15, 2024 / 4:58 PM IST

Ram Karthik : రామ్ కార్తీక్, క‌శ్వి జంటగా ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మాణంలో మనోజ్ పల్లేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వీక్షణం’. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా రాబోతుంది. వీక్షణం సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ క్రమంలో హీరో రామ్ కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

Also Read : JR NTR : దేవ‌ర సినిమాని మీ భుజాల‌పై మోసినందుకు.. ఎన్టీఆర్ స్పెష‌ల్ లెట‌ర్ వైర‌ల్‌

వీక్షణం సినిమా గురించి రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. డైరెక్టర్ మనోజ్ పల్లేటి కథ చెప్పగానే ఆసక్తికరంగా అనిపించింది. మనం కథ వినేటప్పుడు నెక్స్ట్ ఇలా జరుగుతుంది అని ఊహిస్తాము. కానీ వీక్షణం కథ విన్నప్పుడు అలా గెస్ చేయలేకపోయాను. సినిమాలో ట్విస్టులు చాలా బాగుంటాయి. ఇక ఈ సినిమాలో సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తాను. పక్కవాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉన్న క్యారెక్టర్ నాది. ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అతని జీవితంలోకి ఓ అమ్మాయి వస్తే కథ ఎలా మలుపులు తిరిగింది అని ఆసక్తికరంగా ఉంటుంది సినిమా. నా క్యారెక్టర్ సరదా నుంచి సీరియస్ గా మారి డిటెక్టివ్ లా మారుతుంది. మా సినిమాలో ప్రీ క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు. ఇందులో హీరో ఒకర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. హీరోని అతనికి తెలియకుండా ఇంకొకరు అబ్జర్వ్ చేస్తారు. అందుకే వీక్షణం అనే టైటిల్ పెట్టాం అని తెలిపారు.

Veekshanam Hero Ram Karthik Interesting Comments about Movie

అలాగే.. నేను గతంలో థ్రిల్లర్స్ చేశాను గానీ మిస్టరీ థ్రిల్లర్ లో నటించడం ఇదే మొదటిసారి. నా గత సినిమాల కంటే ఇందులో మెచ్యూర్డ్ గా, సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేసానని అంటున్నారు. డైరెక్టర్ కొత్తవాడు కావడంతో మొదట్లో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మా నిర్మాత అశోక్ గారికి థ్యాంక్స్ చెప్పాలి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అని అన్నారు.

ఇక తన గురించి చెప్తూ.. 2016లో దృశ్యకావ్యం సినిమా నుంచి నేను సినిమాలు చేస్తున్నాను. ఎఫ్‌యూసీకే, గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమాలు నాకు మంచి పేరు తెచ్చాయి. వీక్షణం కూడా హీరోగా నాకు సపోర్ట్ అవుతుంది. ఆ తర్వాత వాసు గారి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను అని తెలిపారు.