Veera Simha Reddy Third single update
Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ నుంచి చాలా రోజులు తరువాత వస్తున్న ఫ్యాక్షన్ డ్రామా మూవీ ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాలో బాలయ్య వింటేజ్ లుక్స్ లో దర్శనమివ్వనున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలని విడుదల చేశారు మేకర్స్.
Veera Simha Reddy: వీరసింహారెడ్డి లాస్ట్ సాంగ్.. ఇక్కడే కానిస్తారట!
తాజాగా ఈ మూవీలోని మూడో పాటగా ఐటమ్ సాంగ్ ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు. అధికారికంగా డేట్ ప్రకటించనప్పటికీ డిసెంబర్ 25న ఈ పాట విడుదల అవుతుంది అంటూ ఒక ఫ్యాన్ చేసిన పోస్ట్ కి డైరెక్టర్ గోపీచంద్ రియాక్ట్ అయ్యాడు. ‘ఈ సాంగ్ మాములుగా ఉండదు. మా బావ థమన్ కుమ్మేసాడు’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు ఆ సాంగ్ వినడానికి ఆతురతగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఐటమ్ నెంబర్ కి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించాడు. ఇక ఈ పాటలో బాలకృష్ణ, శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన మాస్ స్టెప్పులు అదరగొట్టేసాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తుంది. న్యూ ఇయర్ వేడుకల్లో ఈ పాట మోగేలా ఉంటుంది అంటున్నారు మేకర్స్. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతున్నా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Eee song untadiiiiiii?..maaa Bawa @MusicThaman kummeysaduuu ❤️??? https://t.co/2PxAlqc9ok
— Gopichandh Malineni (@megopichand) December 19, 2022