Veerasimha Reddy : వీరసింహుని విజయోత్సవం.. గ్రాండ్‌గా రేపే..

బాలకృష్ణ, శృతి హాసన్, హానీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్.. లాంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి.............

Veerasimha Reddy : వీరసింహుని విజయోత్సవం.. గ్రాండ్‌గా రేపే..

Veerasimha Reddy grand success celebrations by movie unit

Updated On : January 21, 2023 / 7:54 AM IST

Veerasimha Reddy :  బాలకృష్ణ, శృతి హాసన్, హానీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్.. లాంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమా దాదాపు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మరింత దూసుకెళ్తుంది.

అఖండ సినిమా తర్వాత వెంటనే వీరసింహారెడ్డి సినిమాతో కూడా 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించడంతో బాలకృష్ణ, చిత్ర యూనిట్, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇదే సంక్రాంతికి మైత్రి నిర్మాతల దగ్గర నుంచి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా కుడా భారీ విజయం సాధించడంతో ఆ సినిమాకి సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Pathaan : పఠాన్ సినిమా టికెట్ ఇప్పించండి.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా.. వైరల్ అవుతున్న అభిమాని వీడియో..

ఇప్పుడు వీరసింహారెడ్డికి కూడా గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేయనున్నారు. వీరసింహుని విజయోత్సవం పేరిట వీరసింహా రెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో అభిమానుల మధ్య గ్రాండ్ గా చేయబోతున్నారు. దీనిపై చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలయ్య అభిమానులు భారీగా ఈ సెలబ్రేషన్స్ కి రానున్నారు. బాలకృష్ణతో పాటలు చిత్రయూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొననుంది.