Venkatesh : మాజీ మిస్ ఇండియాతో ఫ్లైట్‌లో వెంకీమామ.. స్పెషల్ యాడ్ కోసం..

నెక్స్ట్ సినిమాని ప్రకటించేలోపే తాజాగా ఓ కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు వెంకటేష్.

Venkatesh : మాజీ మిస్ ఇండియాతో ఫ్లైట్‌లో వెంకీమామ.. స్పెషల్ యాడ్ కోసం..

Venkatesh Manasa Varanasi New Advertisement Video Goes Viral

Updated On : March 18, 2024 / 3:41 PM IST

Venkatesh : వెంకటేష్ ఇటీవలే సంక్రాంతికి సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. తన నెక్స్ట్ సినిమాని ప్రకటించేలోపే తాజాగా ఓ కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ యాడ్ లో వెంకటేష్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి(Manasa Varanasi) నటించారు. రియల్ ఎస్టేట్ కంపెనీ వాసవి గ్రూప్ కి సంబంధించిన ఓ యాడ్ లో వీరిద్దరూ కలిసి నటించారు.

ఈ యాడ్ లో వెంకటేష్, మానస వారణాసి కలిసి ఫ్లైట్ లో హైదరాబాద్ కి వస్తుంటారు. ఫ్లైట్ లో నుంచి చూసి హైదరాబాద్ చాలా బాగుంది అని మానస అడగడంతో సిటీలోకి వెళ్లి చూద్దాం అని వెంకటేష్ అంటాడు. వాసవి గ్రూప్ కట్టిన ఇళ్లు చూపించి మానస హైదరాబాద్ కి వచ్చేస్తాను, ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. అలా ఇద్దరూ కలిసి యాడ్ చేశారు. గతంలో కూడా వెంకటేష్ పలు యాడ్స్ లో కనిపించాడు.

Also Read : Singer Mangli : నేను బాగానే ఉన్నాను.. రూమర్స్ నమ్మొద్దు.. మంగ్లీ పోస్ట్ వైరల్..

మానస వారణాసి ఈ యాడ్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. వెంకటేష్ సర్ తో పనిచేయడం హ్యాపీగా ఆడుకున్నట్టు ఉంది అంటూ పోస్ట్ చేసింది. దీంతో వెంకీమామ కొత్త యాడ్ వైరల్ గా మారింది. మీరు కూడా వెంకటేష్ – మానసల కొత్త యాడ్ చూసేయండి.