Venkatesh : సౌత్ సినిమా కమల్‌హాసన్‌కి ముందు.. కమల్‌హాసన్‌కి తర్వాత..

విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ.. ''సౌత్ సినిమాలో రెండు శకాలు ఉంటే ఒకటి కమల్‌హాసన్‌ గారికి ముందు, ఇంకోటి కమల్‌హాసన్‌ వచ్చిన తర్వాత. కమల్ గారితో............

Venkatesh : సౌత్ సినిమా కమల్‌హాసన్‌కి ముందు.. కమల్‌హాసన్‌కి తర్వాత..

Vikram

Updated On : June 1, 2022 / 6:53 AM IST

Kamalhaasan :  కమల్‌హాసన్‌, విజయ్ సేతుపతి, ఫాహిద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో సూర్య గెస్ట్ రోల్ తో భారీగా తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా విక్రమ్. ఈ సినిమాని తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజన్ తెరకెక్కించారు. విక్రమ్ సినిమాని పాన్ ఇండియా సినిమాగా జూన్ 3న అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాని తెలుగులో నితిన్, నితిన్ తండ్రి శ్రేష్ఠ మూవీస్ తరపున రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Singer KK: ప్రఖ్యాత సింగర్ ‘కేకే’ కన్నుమూత

విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ.. ”సౌత్ సినిమాలో రెండు శకాలు ఉంటే ఒకటి కమల్‌హాసన్‌ గారికి ముందు, ఇంకోటి కమల్‌హాసన్‌ వచ్చిన తర్వాత. కమల్ గారితో ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయాలని ఉంది కానీ కుదరడంలేదు. కమల్‌గారు నాకు అపూర్వ సహోదరులు లాంటి వారు. కమల్‌ గారి ‘పదినారు వయదినిలే’ (పదహారేళ్ల వయసు) సినిమా చూసిన తర్వాత ఆయన నటనకు నేను క్లీన్‌ బౌల్డ్. ఆయన నటించిన ‘మరో చరిత్ర’ ప్రతి యాక్టర్‌కు ఒక జీపీఎస్‌ లాంటిది. ‘దశావతారం’లాంటి సినిమా చేయాలంటే ఓ యాక్టర్‌కు ధైర్యం సరిపోదు. ‘ఏక్‌ దూజే కేలియే’తో ఆయన ఫస్ట్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. ఈ రోజు కమల్‌గారు గ్లోబల్‌ స్టార్‌. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలో దశావతారాలు కాదు శతావతారాలు కనిపిస్తాయి అని తెలిపారు.