Vennela Kishore : వెన్నెల కిషోర్ హీరోగా సినిమా.. చారి 111.. కామెడీ స్పై కథతో.. సత్య వాయిస్‌తో వీడియో చూశారా?

హీరోగా మారబోతున్నాడు వెన్నెల కిషోర్. తాజాగా వెన్నెల కిషోర్ హీరోగా చారి 111 అనే సినిమాని అనౌన్స్ చేస్తూ కమెడియన్ సత్య వాయిస్ తో ఓ కామిక్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది.

Vennela Kishore : వెన్నెల కిషోర్ హీరోగా సినిమా.. చారి 111.. కామెడీ స్పై కథతో.. సత్య వాయిస్‌తో వీడియో చూశారా?

Vennela Kishore turned as Hero announced Chaari 111 Comedy Spy Movie Glimpse Released

Updated On : August 23, 2023 / 11:34 AM IST

Vennela Kishore : వెన్నెల సినిమాలో తన కామెడీతో అందర్నీ మెప్పించి ఆ సినిమానే తన ఇంటిపేరుగా మారేలా స్టార్ కమెడియన్ గా ఎదిగాడు వెన్నెల కిషోర్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి కమెడియన్ గా మారిపోయిన వెన్నెల కిషోర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కమెడియన్ గా దూసుకుపోతున్నాడు వెన్నెల కిషోర్. ఆ మధ్య డైరెక్టర్ గా కూడా ఓ రెండు సినిమాలు చేశాడు.

ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు వెన్నెల కిషోర్. తాజాగా వెన్నెల కిషోర్ హీరోగా చారి 111 అనే సినిమాని అనౌన్స్ చేస్తూ కమెడియన్ సత్య వాయిస్ తో ఓ కామిక్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోలోనే కథ కూడా చెప్పేశారు. ఒక ఊళ్ళో విలన్ వల్ల సమస్య వస్తే అతన్ని పట్టుకోవడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ గా మురళి శర్మ వస్తాడు, ఆ సమస్యని లక్ ఉంది ట్యాలెంట్ లేని హీరో వెన్నెల కిషోర్ ఎలా సాల్వ్ చేశాడు అనేదే కథ. కామెడీ స్పై కథతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Anasuya : అనసూయ వర్కౌట్స్ చూశారా? ఎంత కష్టపడుతుందో పొద్దున్నే..

కీర్తి కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. మరి కామెడీ హీరోగా వెన్నెల కిషోర్ ఎలా మెప్పిస్తాడా చూడాలి.