Nedumudi Venu : ప్రముఖ నటుడు నెడుముడి వేణు కన్నుమూత

ప్రముఖ నటుడు నెడుముడి వేణు తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు..

Nedumudi Venu : ప్రముఖ నటుడు నెడుముడి వేణు కన్నుమూత

Nedumudi Venu

Updated On : October 11, 2021 / 3:22 PM IST

Nedumudi Venu: ప్రముఖ నటుడు నెడుముడి వేణు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కేరళలోని తిరువనంతపురంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన కోవిడ్ నుంచి కోలుకున్నారు. అయినప్పటికి కోవిడ్ సంబంధిత సమస్యలు తలెత్తడంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.

Samantha – Preetham Jukalker : మా మధ్య రిలేషన్ ఏంటనేది నాగ చైతన్యకు కూడా తెలుసు

వేణుకి భార్య టి.ఆర్.సుశీల, ఉన్ని, కణ్ణన్ అనే ఇద్దరు కుమారులున్నారు. 500లకు పైగా సినిమాల్లో నటించారాయన. మలయాళంతో పాటు తమిళ్‌లోనూ యాక్ట్ చేశారు. ‘భారతీయుడు’ తో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. పోషించేది ఎలాంటి పాత్ర అయిన అందులోకి పరకాయ ప్రవేశం చేసి, తన నటనతో అద్భుతంగా పండించేవారు.

Rakshitha : గుళ్లో ‘ఇడియట్’ హీరోయిన్‌ను చుట్టుముట్టిన జనాలు

ఒక చిత్రానికి స్క్రీన్‌ప్లే తో పాటు దర్శకత్వం కూడా వహించారు. తన అద్భుతమైన నటనకు గాను మూడు నేషనల్ అవార్డులు, ఆరు కేరళ స్టేట్ అవార్డులతో పాటు మరెన్నో ప్రశంసలు, ప్రేక్షకాభిమానుల రివార్డులు అందుకున్నారు.

Satyagrahi : ఆగిపోయిన సినిమాపై పవన్ ట్వీట్ వైరల్

నెడుముడి వేణు మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ భారతీయ చిత్ర పరిశ్రమ వారు నివాళులర్పిస్తున్నారు. ధన్య రాజేంద్రన్, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజీవ్ మీనన్ సహా పలువురు మలయాళీ సినీ ప్రముఖులు నెడుముడి వేణుకి నివాళులర్పిస్తున్నారు.