NTR: తారక్‌తో మూవీపై వెట్రిమారన్ కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Vetrimaaran Comments On Movie With Jr NTR
NTR: తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమా వస్తుందంటే కేవలం తమిళ ప్రేక్షకులే కాకుండా ఇతర భాష ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తుంటారు. రియలిస్టిక్ మూవీలకు కేరాఫ్‌గా నిలిచిన ఈ డైరెక్టర్ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూరి హీరోగా నటించిన ‘విడుతలై-1’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
NTR30: ఎన్టీఆర్ సినిమాపై కొత్త బజ్.. నిజంగానే అలాంటి పాత్ర ఉంటుందా..?
ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే వెట్రిమారన్ ఎప్పటినుండో తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో వెట్రిమారన్ ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్రశ్నకు వెట్రిమారన్ సమాధానం ఇచ్చాడు. తారక్‌తో తాను నిజంగానే ఓ సినిమా చేయాలని అనుకుంటున్నానని.. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేస్తానని ఆయన తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే మరికొంత సమయం పడుతుందని వెట్రిమారన్ తెలిపారు.
Vetrimaaran : నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..!
ఇక ఈ వార్తతో తారక్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. వెట్రిమారన్ లాంటి నేషనల్ అవార్డ్ డైరెక్టర్ తారక్‌తో సినిమా చేస్తే.. అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి ఈ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి.