Victory Venkatesh : వరల్డ్ కప్ భారత్‌దే.. క్రికెటర్స్ బయో‌పిక్‌లో నటించే ఆలోచన లేదు.. వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వరల్డ్ కప్ మనదే అంటున్నారు విక్టరీ వెంకటేష్. భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే తుదిపోరు చూడటానికి అహ్మదాబాద్ వెళ్తున్నట్లు చెప్పారు. వరల్డ్ కప్ ఫైనల్స్ గురించి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Victory Venkatesh : వరల్డ్ కప్ భారత్‌దే.. క్రికెటర్స్ బయో‌పిక్‌లో నటించే ఆలోచన లేదు.. వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Victory Venkatesh

Updated On : November 18, 2023 / 5:32 PM IST

Victory Venkatesh : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సెమీ ఫైనల్స్‌లో నెగ్గిన భారత్, ఆస్ట్రేలియా ఆదివారం జరిగే ఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ సెలబ్రిటీలు ఇండియా గెలుపును ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ టైటిల్ మనదే అంటున్నారు విక్టరీ వెంకటేష్.

World Cup Final : వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆటకు తోడు పాట జోష్ కూడా .. ముగింపు వేడుకలకు బీసీసీఐ భారీ ఏర్పాట్లు

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు సమయం దగ్గరపడుతోంది. ఆదివారం జరగనున్న ఫైనల్స్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్స్‌లో వరల్డ్ కప్ మనదే అంటున్నారు విక్టరీ వెంకటేష్. ఇండియన్ టీమ్ కోసం, వండర్ఫుల్ రికార్డ్ చూడటం కోసం తను అహ్మదాబాద్ వెళ్తున్నట్లు చెప్పారు.

కోహ్లీ 50వ సెంచరీ పూర్తి చేసి సచిన్ రికార్డు బ్రేక్ చేసిన క్షణాల్ని తను స్టేడియంలో స్వయంగా చూడటం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు వెంకటేష్. షమీ ఆటతీరుపై కూడా ప్రశంసలు కురిపించారు. క్రికెటర్స్ బయోపిక్ తీస్తే నటిస్తారా? అన్న ప్రశ్నకు చేయాలని లేదు అని బదులిచ్చిన వెంకటేష్ తను క్రికెట్ చూస్తే చాలని నవ్వుతూ చెప్పారు. వరల్డ్ కప్‌లో ఇండియన్ టీమ్ పెట్టిన ఎఫర్ట్‌ను వెంకటేష్ అభినందించారు.

World Cup Final : వావ్.! చేతి గోరు కంటే బుల్లి బంగారపు క్రికెట్ వరల్డ్ కప్ ..

వరల్డ్ కప్ ఫైనల్స్‌కు సమయం దగ్గరపడుతుండటంతో సెలబ్రిటీలంతా అహ్మదాబాద్‌కు క్యూ కడుతున్నారు. భారత జట్టు విజయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.