Starlink India : స్టార్‌లింక్ వచ్చేస్తోందోచ్.. భారత్‌లో లాంచ్ డేట్, ఇంటర్నెట్ స్పీడ్, పూర్తి ప్లాన్ల వివరాలు.. నెలకు ఎంతంటే?
Starlink India : స్టార్‌లింక్ త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అధికారికంగా ప్రారంభించనుంది. అంచనా ధర, ఇంటర్నెట్ స్పీడ్ వంటి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
Starlink India ( Image Credit to Original Source)
- అతి త్వరలో భారత మార్కెట్లోకి స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులు
- శాటిలైట్ ఇంటర్నెట్ 25Mbps నుంచి 225Mbps స్పీడ్ ఉండొచ్చు
- సింగిల్ టైమ్ రూ.30వేల నుంచి రూ.35వేల వరకు ధర చెల్లించాలి
- నెలవారీ ధర రూ.3,500 నుంచి రూ.8వేల వరకు
Starlink India : అతి త్వరలో భారత్‌కు స్టార్‌లింక్ వచ్చేస్తోంది.. దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు మస్క్ కంపెనీ రెడీగా ఉంది. స్టార్‌లింక్ ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే అనేక లీకులు వచ్చాయి. అతి త్వరలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. వాస్తవానికి స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆమోదం పొందలేదు.
ఇంకా కొన్ని అప్రూవల్స్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. స్టార్‌లింక్ అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.. భారత్ ఇంటర్నెట్ మార్కెట్లో స్టార్ లింక్ అంచనా ధర, లాంచ్ తేదీ, ఇంటర్నెట్ స్పీడ్ వంటి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
స్టార్‌లింక్ స్పీడ్ , లభ్యత, కనెక్షన్ల లిమిట్ :
భారత ప్రభుత్వం సూచించిన ప్రకారం.. స్టార్‌లింక్ కనెక్షన్‌ల సంఖ్యకు దేశంలో గరిష్ట పరిమితి ఉంటుంది. దాని ప్రకారమే స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు భారత్ లో గరిష్టంగా 20 లక్షల కనెక్షన్‌లను పొందవచ్చు. భారత మార్కెట్‌లోని లోకల్ పేయర్లపై ప్రభావం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పరిమితిని విధించింది.
Read Also : Google AI Mode : కొంపదీసి మీరు గూగుల్ AIని హెల్త్ టిప్స్ అడుగుతున్నారా?
స్పీడ్ రేంజ్ విషయానికి వస్తే.. భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ 25Mbps నుంచి 225Mbps వేగంతో వస్తుందని సూచిస్తున్నాయి. ఈ సర్వీసు దేశంలోని తక్కువ ఇంటర్నెట్ సర్వీసు ఉన్న ప్రాంతాల్లోనే అందుబాటులోకి రానుంది. అయితే, స్టార్‌లింక్ పట్టణ ప్రాంతాలలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో పోటీ పడితే మాత్రం ధర కూడా దిగొచ్చే అవకాశం ఉంది.
భారత్‌లో స్టార్‌లింక్ ధర, లాంచ్ తేదీ :
స్టార్‌లింక్‌ను ఒకేసారి రూ.30వేల నుంచి రూ.35వేల వరకు ధరతో భారత మార్కెట్లో అందించే అవకాశం ఉంది. మరోవైపు, ఈ ప్లాన్‌ల నెలవారీ ధర రూ.3,500 నుంచి రూ.8వేల వరకు ఉండవచ్చు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే దేశంలో మొదటి త్రైమాసికం చివరి నాటికి స్టార్‌లింక్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.
