KBC 15 : కేబీసీలో అమాయకత్వం, చలాకీతనంతో ఆకట్టుకున్న మహిళ.. అమితాబ్‌తో పాటు ఆడియన్స్ ఫిదా..

కౌన్ బనేగా కరోడ్‌పతి 15 సీజన్‌కి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. తన మాటలతో ఆకట్టుకుని అందర్నీ కడుపుబ్బా నవ్వించిన ఆ మహిళ అమితాబ్‌తో పాటు ఆడియన్స్ మనసు దోచుకున్నారు.

KBC 15 : కేబీసీలో అమాయకత్వం, చలాకీతనంతో ఆకట్టుకున్న మహిళ.. అమితాబ్‌తో పాటు ఆడియన్స్ ఫిదా..

KBC 15

KBC 15 : ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 15’ సీజన్‌కి సంబంధించిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోల్‌కతా నుండి పోటీదారుగా పాల్గొన్న అలోలికా భట్టాచార్జి గుహ అనే మహిళ తమ మాటలతో నవ్వులు పూయించి అమితాబ్‌తో పాటు ఆడియన్స్ మనసు దోచుకున్నారు.

Prashanth Neel : ప్రశాంత్ నీల్ సినిమాలో అమితాబ్ విలన్‌గా.. NTR31లో చేయబోతున్నారా..?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎపిసోడ్ తాలుకు వీడియోలో అలోలిక తన మొదటి విమాన ప్రయాణ అనుభవాన్ని సరదాగా షేర్ చేసుకున్నారు. టికెట్ కొనుక్కుని విమానం ఎక్కాక మన లగేజ్‌ని విమాన సిబ్బంది భద్రపరుస్తారని.. రైల్లో టిక్కెట్‌కి డబ్బులు చెల్లించినా అటువంటి సౌకర్యం ఉండదని చెబుతూ నవ్వులు పూయించారు. కేబీసీ వారు ఏర్పాటు చేసిన హోటల్‌లో బస ఎలా ఉందని అమితాబ్ ఆమెను ప్రశ్నించారు. అంత పెద్ద హోటల్‌కి వెళ్లేంత ఆర్ధిక పరిస్థితి తమకు లేదని.. తన భర్త వల్ల కూడా కాదని కేబీసీ వల్ల తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది.

మీ మామగారితో ఇలాగే నవ్వుతూ మాట్లాడతారా? అని అమితాబ్ అడిగిన ప్రశ్నకు తనలో తను ఒంటరిగా నవ్వుకోవడం చూసి అత్తగారు అడుగుతుందని.. మంచి విషయాలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటున్నానని ఆమెకు బదులిస్తానని చెప్పింది. జనం డబ్బులు ఖర్చు పెట్టి జిమ్‌కు వెళ్తారు.. కానీ తను రోజుకు మూడుసార్లు దాల్ చావల్, చేపలు తింటూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పింది. మాటల మధ్యలో పలుమార్లు ఆమె ‘జయహో కేబీసీ’ అని ఊతపదంగా అనడం అందర్నీ నవ్వించింది. అమాయకంగా, చలాకీగా ఉన్న అలోలిక ఎపిసోడ్ మొత్తం అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. అమితాబ్ కూడా ఫిదా అయిపోయారు. ‘జయహో కేబీసీ’ అనే శీర్షికతో ఈ వీడియోను అమితాబ్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఎపిసోడ్ చూసిన కోట్లాదిమంది మనసు దోచుకున్నారు అలోలిక. అంతేకాదు షోలో ఆమె రూ. 12,50,000 గెలుచున్నారు.

Silk Smitha Biopic : సిల్క్ స్మిత పుట్టిన రోజు.. మరో బయోపిక్ అనౌన్స్.. ఆమెలా నటించే హీరోయిన్ ఎవరో తెలుసా?

కేబీసీ మొదలైన సంవత్సరం 2000 నుండి అమితాబ్ ఈ షో హోస్ట్ చేస్తున్నారు. 2007 లో వచ్చిన మూడవ సీజన్ మినహా అన్ని సీజన్స్ అమితాబ్ హోస్ట్ చేశారు. టైగర్ ష్రాఫ్‌తో కలిసి అమితాబ్ నటించిన సినిమా గణపత్ : ఎ హీరో ఈజ్ బోర్న్ అక్టోబర్ 20 న విడుదలైంది. కల్కి 2898 AD తో పాటు  2024 లో పలు ప్రాజెక్టులకు అమితాబ్ సైన్ చేశారు.