Salman Khan : బర్త్‌డే రోజు తనలోని స్పెషల్ ట్యాలెంట్ చూపించిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటుడిగా చాలామందికి తెలుసు. కానీ ఆయనలో ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. సల్లూ భాయ్ అద్భుతమైన పెయింటర్ కూడా. సల్మాన్ వేసిన పెయింటింగ్స్ కోట్లలో అమ్ముడుపోయాయంటే నమ్ముతారా?

Salman Khan
Salman Khan : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 3 దశాబ్దాలుగా అలుపు లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. చాలామందికి సల్మాన్ నటుడిగానే తెలుసు.. ఆయనలో మరెన్నో కోణాలున్నాయి. డిసెంబర్ 27 సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. సల్లూ బాయ్‌కి బర్త్ డే విషెస్ చెబుదాం.
‘మైనే ప్యార్ కియా’ సినిమా దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించిన మూవీ. ఇప్పటికీ ఈ సినిమా అంటే జనం తెగ ఇష్టపడతారు. ఈ సినిమాతో పాపులర్ అయ్యారు సల్మాన్ ఖాన్. ఆయన నటనకు అమ్మాయిలు ఫిదా అయిపోయారు. అంతకు ముందే 1998 లో ‘బీవీ హో తో ఐసీ’ అనే సినిమాలో సపోర్టింగ్ రోల్‌తో సల్మాన్ వెండితెరపై అడుగుపెట్టినా మైనే ప్యార్ కియా మంచి పేరుతో పాటు అవకాశాలు తెచ్చిపెట్టింది. 90 లలో సల్మాన్ నటించిన హమ్ ఆప్ కే హై కౌన్, బీవీ నెం.1, కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోతా హై సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 2000 లో సల్మాన్‌కి పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. 2011 నుండి వరుసగా చేసిన ఏక్ థా టైగర్, బాడీ గార్డ్, కిక్, బజరంగీ భాయి జాన్, సుల్తాన్ బాలీవుడ్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టాయి.
సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితానికి వస్తే స్క్రీన్ రైటర్ సలీం ఖాన్, సుశీల చరక్ మొదటి సంతానం సల్మాన్ ఖాన్, సల్మాన్ ఇద్దరు తమ్ముళ్లు అర్బాజ్, సోహైల్.. చెల్లెళ్లు అల్విరా ఖాన్ అగ్ని హోత్రి, అర్రితా. సల్లూ భాయ్‌కి కొందరు నటీమణులతో ఎపైర్లు నడిచినా అవి పెళ్లివరకూ రాలేదు. 58 సంవత్సరాలు వచ్చిన పెళ్లి చేసుకోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. సల్మాన్ కేవలం నటుడు మాత్రమే కాదు.. ఆయనలో అనేక కోణాలున్నాయి. వీర్, చంద్రముఖి వంటి సినిమాలకు రచయితగా పనిచేసారని చాలామందికి తెలియదు. హిందీ బిగ్ బాస్ ప్రతి సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్ 17 వ సీజన్ కంటిన్యూ చేస్తున్నారు.
Tripti Dimri : బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసిన ‘యానిమల్’ భామ?
సల్మాన్ ఖాన్‌లో అద్భుతమైన పెయింటర్ కూడా ఉన్నారు. సల్మాన్ వేసిన కొన్ని పెయింటింగ్స్ బాగానే అమ్ముడు పోయాయట. ఇటీవల సల్మాన్ పెయింటింగ్ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెల్లని కాగితంపై నల్లటి రంగుతో చేతివేళ్లతో చకచకా సల్మాన్ పెయింటింగ్ వేస్తూ కనిపించారు. ఆయన పెయింటింగ్ వేసే విధానం చూసి ఫ్యాన్స్ ముచ్చటపడిపోయారు. సల్మాన్ ఖాన్‌కి బర్త్ డే విషెస్ చెప్పారు. సల్మాన్ సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. తాజాగా సల్మాన్ నటించిన ‘టైగర్ 3’ సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది. త్వరలో మరో రెండు ప్రాజెక్టులతో సల్మాన్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram