94th Oscars : అకాడమీ అవార్డ్స్‌కు ఆహ్వానం..
బ్యూటిఫుల్ యాక్ట్రెస్ విద్యా బాలన్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ 94వ ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రాంకి ఇన్వైట్ చెయ్యబడ్డారు..

Vidya Balan And Ekta Kapoor Invited To 94th Oscars Academy Ceremony
94th Oscar Academy: ఆస్కార్ అవార్డ్స్ వేడుకకోసం హాలీవుడ్‌తో పాటు మూవీ లవర్స్, యావత్ సినిమా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. ఇతర దేశాలనుండి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది ఆహ్వానం అందితే అదో గొప్ప అచీవ్‌మెంట్ అనుకుంటారు సెలబ్రిటీలు.
వచ్చే ఏడాది మార్చిలో 94వ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ ఎప్పటిలానే గ్రాండ్‌గా జరుగబోతోంది. గతేడాది ఈ వేడుకకు ఆలియా భట్, హృతిక్ రోషన్ అతిథులుగా అటెండ్ అయ్యారు. ఇప్పుడు మరో ఇద్దరు బాలీవుడ్ సెలబ్రిటీలకు ఆస్కార్ ఆహ్వానం అందింది. బ్యూటిఫుల్ యాక్ట్రెస్ విద్యా బాలన్, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్ 94వ ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రాంకి ఇన్వైట్ చెయ్యబడ్డారు.
‘పరిణీత’, ‘కహానీ’, ‘తుమ్హారీ సులూ’, ‘పా’, ‘భూల్ భులైయా’, ‘బాబీ జాసూస్’, డర్టీ పిక్చర్’, ‘శకుంతలా దేవి’ సినిమాలతో ఆకట్టుకున్న విద్యా బాలన్.. బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్ అంటే ఓ బ్రాండ్ అనేలా సీరియల్స్, సినిమాలు నిర్మించిన ఏక్తా కపూర్.. వీరిద్దరికి 94వ ఆస్కార్ అవార్డ్స్ సెరమనీకి ఇన్విటేషన్ రావడం బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
‘క్లాస్ ఆఫ్ 2021’ పేరుతో అంగరంగవైభవంగా జరుగబోయే ఈ కార్యక్రమానికి అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో 50 దేశాలనుండి 395 కొత్తవారిని ఆహ్వానించారు ఆస్కార్ నిర్వాహకులు. ఈసారి 46 శాతం మహిళలు, అమెరికా మినహా మిగతా 49 దేశాలనుండి 53 శాతం ఇంటర్నేషనల్ మెంబర్స్ ఉన్నారు.