Vijay Antony : విజయ్ ఆంటోనీ నెక్స్ట్ సినిమా.. ‘విక్రమ్ రాథోడ్’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

విజయ్ ఆంటోనీ ఇటీవల బిచ్చగాడు 2 సినిమాతో కూడా వచ్చి హిట్ కొట్టారు. ఇప్పుడు తెలుగులో మరో సినిమాతో రాబోతున్నారు విజయ్ ఆంటోనీ.

Vijay Antony : విజయ్ ఆంటోనీ నెక్స్ట్ సినిమా.. ‘విక్రమ్ రాథోడ్’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Vijay Antony Next Movie Vikram Rathode Realising Date Announced

Updated On : November 24, 2023 / 4:17 PM IST

Vijay Antony : తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ తెలుగులో కూడా పలు సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో సూపర్ హిట్ కొట్టిన విజయ్ ఆంటోనీ ఇటీవల బిచ్చగాడు 2 సినిమాతో కూడా వచ్చి హిట్ కొట్టారు. ఇప్పుడు తెలుగులో మరో సినిమాతో రాబోతున్నారు విజయ్ ఆంటోనీ.

విజయ్ ఆంటోనీ హీరోగా సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత, యోగిబాబు, రోబో శంకర్.. పలువురు ముఖ్యపాత్రలతో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘తమిళరాసన్’ ఆల్రెడీ తమిళ్ లో రిలీజయి హిట్ అవ్వగా ఇప్పుడు తెలుగులో ‘విక్రమ్ రాథోడ్’గా(Vikram Rathode) రాబోతుంది.

అపోలో ప్రొడక్షన్స్, SNS మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కగా ఈ సినిమాని బాబు యోగేశ్వరన్ డైరెక్ట్ చేశాడు. రావూరి వెంకటస్వామి, ఎస్.కౌసల్య రాణి నిర్మాతలుగా ఈ సినిమాని తెరకెక్కించగా తెలుగులో ఈ సినిమాని ఓం శివ గంగా ఎంటర్‌ప్రైజెస్, PSR ఫిల్మ్స్ బ్యానర్స్ రిలీజ్ చేస్తున్నారు. విక్రమ్ రాధోడ్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్ గా తెలుగులో రిలీజ్ కాబోతుంది.

టీజర్ గతంలోనే రిలీజ్ చేయగా త్వరలోనే విక్రమ్ రాథోడ్ మూవీ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. యాక్షన్ ఎంటర్టైన్ గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Also Read : Mansoor Ali Khan : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. కానీ ఎలా చెప్పాడో తెలుసా?

ఇటీవల కొన్ని నెలల క్రితం విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన జరిగిన తర్వాత విజయ్ త్వరగా తేరుకొని నిర్మాతలు ఇబ్బంది పడకూడదని ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు వరుసగా చేస్తున్నారు.