Vijay Devarakonda : అనన్య, ఛార్మి మధ్యలో విజయ్.. ముంబైలో ఎంజాయ్ చేస్తున్న లైగర్ టీం..
మంగళవారం సాయంత్రం ముంబైలో లైగర్ హీరోయిన్ అనన్య పాండే, ఛార్మి, విజయ్ దేవరకొండ, లైగర్ టీం అంతా కలిసి..............

Ananya Pande
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమా షూట్స్ తో బిజీగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితమే లైగర్ సినిమా షూట్ పూర్తి చేసి, సమంతతో కలిసి నటిస్తున్న సినిమా కోసం కశ్మీర్ వెళ్ళాడు. ఈ సినిమా కూడా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో విజయ్ కశ్మీర్ నుంచి డైరెక్ట్ ముంబైకి వెళ్ళాడు. అక్కడ లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
మంగళవారం సాయంత్రం ముంబైలో లైగర్ హీరోయిన్ అనన్య పాండే, ఛార్మి, విజయ్ దేవరకొండ, లైగర్ టీం అంతా కలిసి వర్క్ గురించి చర్చించారు. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి రెస్టారెంట్ కి వెళ్లి పార్టీ చేసుకున్నారు. అనన్య, ఛార్మి, విజయ్ దేవరకొండ మంగళవారం రాత్రి పార్టీ చేసుకొని రెస్టారెంట్ నుంచి వెళ్తుండగా మీడియాకి చిక్కారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే విజయ్, సమంత సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలవ్వనుంది.