Jana Gana Mana: ‘జనగణమన’కు ఇండియన్ డిఫెన్స్ ఝలక్..?
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తికాక ముందే, తన నెక్ట్స్ మూవీని మరోసారి దర్శకుడు పూరీ జగన్నాధ్....

Vijay Devarakonda Jana Gana Mana Gets Shock From Defence Ministry
Jana Gana Mana: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తికాక ముందే, తన నెక్ట్స్ మూవీని మరోసారి దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. లైగర్ సినిమాను కూడా పూరీ తెరకెక్కిస్తుండటంతో, మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తమ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పూర్తిగా దేశభక్తి సినిమాగా తెరకెక్కించేందుకు పూరీ-విజయ్‌లు రెడీ అయ్యారు.
JGM: డిఫెన్స్ మినిస్టర్‌తో JGM టీమ్!
పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ చిత్రాన్ని విజయ్ దేరవకొండతో తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు ఈ డైరెక్టర్. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు పూరీ అండ్ టీమ్ రెడీ అవుతుంటే.. తాజాగా ఈ సినిమాకు ఇండియన్ డిఫెన్స్ ఝలక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కథకు డిఫెన్స్ నుండి క్లియరెన్స్ తీసుకునేందుకు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రయత్నించాడట. అయితే.. ఈ సినిమా కథలో భారత ఆర్మీని తప్పుగా చూపించే ప్రయత్నం జరిగిందంటూ డిఫెన్స్ ఈ సినిమా కథకు నో చెప్పిందట.
Vijay Devarakonda: జనగణమన అంటూ యుద్ధంలోకి దూకిన దేవరకొండ
డైరెక్టర్ రాసుకున్న కథలో ఇండియన్ ఆర్మీ ముంబై నగరాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటుందని.. అయితే ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించే విధంగా ఉండటంతో ఈ సినిమా కథలో మార్పులు చేయాలని డిఫెన్స్ వారు సూచించారట. అయితే ఈ విషయంపై డిఫెన్స్ మినిస్ట్రీని సంప్రదించగా, వారు కూడా ఈ సినిమా కథలో ఖచ్చితమైన మార్పులు కోరారట. దీంతో పూరీ ఇప్పుడు ఈ సినిమా కథను మళ్లీ కొత్తగా రాస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. మరి ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.