Vijay Devarakonda: యూఎస్ డీల్ క్లోజ్ చేసుకున్న ఖుషి.. టార్గెట్ ఎంతంటే?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ‘లైగర్’ ఎఫెక్ట్ నుండి బయటకొచ్చిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఖషి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Vijay Devarakonda: యూఎస్ డీల్ క్లోజ్ చేసుకున్న ఖుషి.. టార్గెట్ ఎంతంటే?

Vijay Devarakonda Khushi Movie Locks US Deal

Updated On : October 30, 2022 / 3:18 PM IST

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీ ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ నుండి బయటకొచ్చిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఖషి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. మూవీ యూనిట్ క్లారిటీ

ఈ సినిమాలో అందాల భామ సమంత హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమా చిత్రీకరణ దాదాపు చివరిదశకు చేరుకున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ హక్కులు భారీ రేటుకు అమ్ముడైనట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఏకంగా రూ.6 కోట్ల భారీ రేటుకు యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్‌కు అమ్మినట్లుగా తెలుస్తోంది.

Vijay Devarakonda: ఆ పాత్ర చేయడం తన డ్రీమ్ అంటోన్న రౌడీ స్టార్!

ఈ లెక్కన ఖుషి మూవీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1.1 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబడితేనే హిట్ అవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. యూఎస్‌లో స్ట్రాంగ్ బేస్ ఉన్న విజయ్ దేవరకొండకు ఈ మార్క్‌ను టచ్ చేయడం పెద్ద కష్టం కాదని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే సినిమాలో కంటెంట్ కరెక్ట్‌గా లేకపోతేనే ఇబ్బందులు ఎదురవుతాయని వారు అంటున్నారు. మరి నిజంగానే ఖుషి సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ మూవీగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.