Buchi Babu: బుచ్చిబాబుకి మళ్లీ నిరాశేనా.. ఈసారి మరో హీరో కూడా?
టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటిన బుచ్చిబాబు సానా, తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చాలా కష్టపడుతున్నాడు. ఉప్పెన చిత్రం తరువాత బుచ్చిబాబు తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి చేస్తాడని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Vijay Devarakonda Rejects Buchi Babu Sana Movie
Buchi Babu: టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటిన బుచ్చిబాబు సానా, తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చాలా కష్టపడుతున్నాడు. ఉప్పెన చిత్రం తరువాత బుచ్చిబాబు తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి చేస్తాడని గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Buchi Babu Sana: తారక్- బుచ్చిబాబు కాంబోలో సినిమా ఉంటుందా.. ఉండదా?
అయితే తారక్‌కు బుచ్చిబాబు చెప్పిన కథ నచ్చకపోవడంతో, ఆయన ఈ స్క్రిప్టును మార్చి తీసుకురమ్మన్నాడు. కానీ, బుచ్చిబాబు చెప్పిన స్క్రిప్టు తారక్‌కు మళ్లీ నచ్చకపోవడంతో ఆయన ఈ సినిమాకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక చేసేదేమీ లేక, బుచ్చిబాబు ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ఇతర హీరోల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాడట. ఈ క్రమంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు బుచ్చిబాబు తన కథను వినిపించాడట.
Buchi Babu : ఎన్టీఆర్ – బన్నీతో సినిమా ఎప్పుడు..?
అయితే ఇక్కడ కూడా బుచ్చిబాబుకు నిరాశే ఎదురయ్యిందట. విజయ్ దేవరకొండ కూడా బుచ్చిబాబు చెప్పిన కథకు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. తారక్‌కు చెప్పిన కథను విజయ్ దేవరకొండకు చెప్పగా, ఆయనకు కూడా ఈ స్టోరీ నచ్చలేదని తెలుస్తోంది. మరి బుచ్చిబాబుతో సినిమా చేసే హీరో ఎవరా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.