Vijay Deverakonda vs Anasuya : సోష‌ల్ మీడియాలో అన‌సూయ‌తో గొడ‌వ‌.. స్పందించిన విజ‌య్.. ‘ఏం న‌డుస్తుందో ఎందుకు న‌డుస్తుందో..’

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) న‌టిస్తున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స‌మంత (Samantha) హీరోయిన్‌. సెప్టెంబ‌ర్ 1న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Vijay Deverakonda vs Anasuya : సోష‌ల్ మీడియాలో అన‌సూయ‌తో గొడ‌వ‌.. స్పందించిన విజ‌య్.. ‘ఏం న‌డుస్తుందో ఎందుకు న‌డుస్తుందో..’

Vijay Deverakonda vs Anasuya

Updated On : August 9, 2023 / 8:17 PM IST

Vijay Deverakonda vs Anasuya : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) న‌టిస్తున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స‌మంత (Samantha) హీరోయిన్‌. సెప్టెంబ‌ర్ 1న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నేడు ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించి చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది.

ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో భాగంగా మీడియా ప్ర‌తినిధులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు చిత్ర బృందాన్ని ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు. అన్ని ప్ర‌శ్న‌ల‌కు హీరో విజ‌య్‌తో పాటు మిగిలిన వారు స‌మాధానాలు చెప్పారు. కాగా.. సోష‌ల్ మీడియాలో అన‌సూయతో గొడ‌వ‌ పై ఓ ప్ర‌శ్న విజ‌య్‌కు ఎదురైంది. దీనిపై అత‌డు స్పందించాడు. గొడ‌వ ప‌డేవాళ్ల‌ను అడగాల‌ని అన్నారు.

Thode Nuvvundaka Lyrical : అమల చేతుల మీదుగా నచ్చినవాడు నుంచి ‘తోడై నువ్వుండక’ లిరిక‌ల్‌

ఎప్పుడు మీరు కాంట్ర‌వ‌ర్సీకి దూరంగా ఉంటారు గానీ సోష‌ల్ మీడియాలో మాత్రం విజ‌య్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ అన‌సూయ మ‌ధ్య‌ గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. ఎందుకు ఇలా జ‌రుగుతుంటుంది. కార‌ణం ఏంటీ..? దీనికి ఏమ‌న్నా ఫుల్‌స్టాప్ ప‌డే అవ‌కాశం ఉందా..? అని ఓ ప్ర‌శ్న విజ‌య్ ను అడిగారు. ఇందుకు విజ‌య్ ఇలా స్పందించాడు. “గొడ‌వ ప‌డేవాళ్ల‌ను అడ‌గాలి. ఎందుకు గొడ‌వ ప‌డుతున్నారో. మ‌న‌కు తెలవ‌దు. అస‌లు ఏం న‌డుస్తుందో అక్క‌డ ఎందుకు న‌డుస్తుందో తెలియ‌దు.” అని స‌మాధానం చెప్పారు. ప్ర‌స్తుతం విజ‌య్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రీ దీనిపై అన‌సూయ స్పందిస్తుందో లేదో చూడాల్సిందే.

HBD Mahesh Babu: ఇందుకే మహేశ్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు.. లేకపోతేనా..

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ట్రైల‌ర్‌లో విజ‌య్‌, స‌మంత ల మ‌ధ్య కెమెస్ట్రీ బాగుంది. “దీన‌మ్మ క‌శ్మీర్ సేమ్ రోజా సినిమాలాగే ఉంది.” అని విజ‌య్ చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. ముస్లిం అమ్మాయిగా స‌మంత క‌నిపిస్తుంది. ఆమెను ప్రేమిస్తుంటాడు. అయితే.. ఆమె బేగం కాదు బ్రాహ్మిణ్ అన్న విష‌యం తెలుస్తుంది. వీరిద్ద‌రి ప్రేమ‌ను కుటుంబాలు వ్య‌తిరేకించ‌డంతో బ‌య‌ట‌కు వెళ్లి పెళ్లి చేసుకుంటారు. వివాహం త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య చిన్న చిన్న‌ గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డానికి కార‌ణం ఏంటి..? వీరి పెళ్లిని పెద్ద‌లు ఒప్పుకున్నారా..? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇక ట్రైల‌ర్‌లో “పెళ్లంటేనే చావురా.. నువ్వెప్పుడో చ‌చ్చిపోయావు.” అని రాహుల్ రామ‌కృష్ణ చెప్పే డైలాగ్‌, “అస‌లు భ‌ర్త అంటే ఎలా ఉండాలో స‌మాజానికి చూపిస్తా.” అంటూ విజ‌య్ చెప్పే డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి. మొత్తంగా ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

Payal Rajputh : పెళ్లి కాలేద‌ని బాదొద్దు.. పెళ్లైన వాళ్లు కూడా దాని కోసమే వెదుకులాట‌.. పాయ‌ల్ ఇన్‌స్టా పోస్ట్ పై నెటీజ‌న్ల ఫైర్‌