Vijay Devarakonda: ముగ్గురితో సై అంటోన్న రౌడీ!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. ‘కాఫీ విత్ కరణ్’ తాజా ఎపిసోడ్‌కు విజయ్ దేవరకొండ, అనన్యా పాండేలు గెస్టులుగా హాజరయ్యారు. మీరు ఎప్పుడైనా ముగ్గురితో శృంగారం చేశారా అని కరణ్ ప్రశ్నించగా.. లేదు అని విజయ్ చెప్పుకొచ్చాడు.

Vijay Devarakonda Sensational Comments In Koffee With Karan
Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారాడు. ‘లైగర్’ సినిమాలో నటిస్తున్న ఈ హీరో, ఈ చిత్ర ప్రమోషన్స్‌ను దేశవ్యప్తంగా అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తూ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ జనాల దృష్టిని కూడా తనవైపుకు తిప్పుకున్నాడు. ఇక ఇటీవల లైగర్ ట్రైలర్ లాంచ్‌లో రౌడీ స్టార్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
Vijay Devarakonda : కరణ్ జోహార్‌కి తనేంటో చూపించడానికే రౌడీ హీరో అలా చేశాడా??
అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ తాజా ఎపిసోడ్‌కు విజయ్ దేవరకొండ, అనన్యా పాండేలు గెస్టులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు వదిలారు. అయితే వివాదాస్పదమైన ప్రశ్నలు అడిగే కరణ్, ఈసారి విజయ్ దేవరకొండను కూడా వదల్లేదు. మీరు ఎప్పుడైనా ముగ్గురితో శృంగారం చేశారా అని కరణ్ ప్రశ్నించగా.. లేదు అని విజయ్ చెప్పుకొచ్చాడు. అయితే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ముగ్గురితో శృంగారం చేస్తానంటూ తనదైన రిప్లై ఇచ్చాడు ఈ హీరో.
Vijay Devarakonda: లైగర్ హాట్ కామెంట్స్.. ఇష్టం లేకపోయినా చేశాడట!
ఇలా ప్రోమోలోనే ఇంతటి స్పైసీ కంటెంట్ ఉంటే, ఇక పూర్తి ఎపిసోడ్‌లో ఇంకా ఎలాంటి ప్రశ్నలు ఉంటాయా అని విజయ్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ ఎపిసోడ్‌ను జూలై 28న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.