Vijay Deverakonda: దుబాయ్ గవర్నమెంట్ నుంచి విజయ్ దేవరకొండకు ఆహ్వానం.. రౌడీ క్రేజ్ మాములుగా లేదుగా..
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేకుండా అదిరిపోయే క్రేజ్ ని సంపాదించుకుంటున్నాడు. లైగర్ చిత్రంలో విజయ్ MMA ఛాంపియన్ షిప్ కి ట్రైనింగ్ అయ్యే బాక్సర్ గా కనిపించాడు. తాజాగా దుబాయ్ లో నిర్వహించే...

Vijay Deverakonda has been invited as the guest of honor by the government of Dubai for the "MMA Championship" boxing competition
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హిట్టు, ప్లాప్ లతో సంబంధం లేకుండా అదిరిపోయే క్రేజ్ ని సంపాదించుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయిన ఈ హీరో.. మళ్ళీ ఆ రేంజ్ హిట్టు ఇవ్వడంలో మాత్రం తడబడుతున్నాడు. భారీ అంచనాలు పెట్టుకొని పూరీజగన్నాధ్ తో కలిసి పాన్ ఇండియా లెవెల్ లో తీసిన “లైగర్” కూడా ఫ్యాన్స్ తో పాటు విజయ్ ని కూడా నిరాశపరిచింది.
Vijay Devarakonda: ఆ పాత్ర చేయడం తన డ్రీమ్ అంటోన్న రౌడీ స్టార్!
అయిన సరే విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడంలేదు. లైగర్ చిత్రంలో విజయ్ MMA ఛాంపియన్ షిప్ కి ట్రైనింగ్ అయ్యే బాక్సర్ గా కనిపించాడు. తాజాగా దుబాయ్ లో నిర్వహించే “MMA ఛాంపియన్ షిప్” బాక్సింగ్ పోటీలకు అక్కడి ప్రభుత్వం విజయ్ దేవరకొండను అతిధిగా ఆహ్వానించింది. అబుదాబి గవర్నమెంట్ నుంచి ఇండియన్ యాక్టర్ గా విజయ్ ఆహ్వానం అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రౌడీ అభిమానులు.
ప్రస్తుతం ఈ రౌడీ బాయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ కి జంటగా సమంత నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.