Samantha : సమంతకు విజయ్ దేవరకొండ లేఖ.. ఏమని రాశాడో తెలుసా?
విజయ్ దేవరకొండ, సమంతతో కలిసి ఖుషీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్, సమంతకు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఏముందో తెలుసా?

Vijay Deverakonda letter to samantha on shaakuntalam release
Samantha : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషీ అనే రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సమంత అనారోగ్యం కారణంగా పోస్ట్‌పోన్ అయ్యింది. ఇటీవలే తిరిగి షూటింగ్ మొదలుపెట్టుకొని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా సమంత నటించిన మరో సినిమా శాకుంతలం (Shaakuntalam) రేపు (ఏప్రిల్ 14) రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే విజయ్, సమంతకు ఒక లేఖ రాశాడు.
Shaakuntalam : శ్రీవారి సేవలో శాకుంతలం టీం..
సామీ, ఎప్పుడు ప్రేమగా ఉత్సాహంగా ఉండే లాస్ట్ 1 ఇయర్ లో చాలా ఇబ్బందులు ఎదురుకున్నావు. అనారోగ్య సమస్యల పై నువ్వు ఎలా పోరాడి గెలిచావో అందరికి తెలుసు. నువ్వు ఎంత భాద పడుతున్నా నీ అభిమానులు కోసం, నీ సినిమాలు కోసం నువ్వు ముందడుగు వేస్తూనే వచ్చావు. చివరికి నీకు విశ్రాంతి అవసరమైన సమయంలో కూడా నువ్వు వెనక్కి తగ్గలేదు. నువ్వు చేసే ప్రతి సినిమా పై నీ కెరీర్ ఆధారపడి ఉంటుందని నువ్వు భావిస్తావు. నీ సంకల్పం, లక్షలాది మంది అభిమానుల ప్రేమ నిన్ను సురక్షితంగా ఉంచుతుంది. రేపు విడుదకాబోతున్న శాకుంతలం చిత్రానికి నా శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.
Shaakuntalam : శాకుంతలంలో లాస్ట్ 15 నిమిషాలు అల్లు అర్హ యాక్టింగ్.. గుణశేఖర్!
కాగా సమంత ‘శాకుంతలం’ హిందూ పురాణాల్లోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ నేపథ్యంతో తెరకెక్కింది. మైథలాజికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ముఖ్య పత్రాలు చేస్తుండగా.. మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
#Shaakuntalam @Samanthaprabhu2 ? pic.twitter.com/Ym9D55aX1Y
— Vijay Deverakonda (@TheDeverakonda) April 13, 2023