Vijay Deverakonda : ముచ్చటగా మూడోసారి.. రజినీకాంత్ పై విజయ్ దేవరకొండ గెలుస్తాడా?
ఇపుడు మూడో సారి అలాంటి పరిస్థితి మళ్ళీ రాబోతుంది. (Vijay Deverakonda)
Vijay Deverakonda
Vijay Deverakonda : తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. రజినీకాంత్ తో పోటీ పడి విజయ్ దేవరకొండ ఇప్పటికే రెండు సార్లు గెలిచాడు, మూడో సారి గెలవబోతున్నాడు అని. ఇదెలా అనుకుంటున్నారా. గతంలో రెండు సార్లు రజినీకాంత్ సినిమా రిలీజ్ అయినప్పుడే అటు ఇటుగా విజయ్ దేవరకొండ సినిమా రిలీజయి హిట్ కొట్టాడు. ఇపుడు మూడో సారి అలాంటి పరిస్థితి మళ్ళీ రాబోతుంది.
2016 జూలై 22న రజినీకాంత్ కబాలి సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. కానీ రిలీజయ్యాక ఫ్లాప్ అయింది. అదే సమయంలో జూలై 29న చాలా చిన్న సినిమాగా విజయ్ దేవరకొండ పెళ్ళి చూపులు రిలీజయి పెద్ద హిట్ కొట్టింది.
అనంతరం 2018 నవంబర్ 29న శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ గా రజనీకాంత్ రోబో ‘2.0’ భారీగా పాన్ ఇండియా వైడ్ రిలీజయింది. ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా తెలుగులో ఫ్లాప్ అయింది. మిగతా చోట్ల కూడా యావరేజ్ గానే నిలిచింది. అయితే దానికి వారం రోజుల ముందే నవంబర్ 17న విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమా రిలీజ్ అయి హిట్ అయింది. రిలీజ్ కి ముందే సినిమా లీక్ అయినా ప్రేక్షకులను మెప్పించి తెలుగులో రోబో 2ని మించి హిట్ అయింది.
దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ముచ్చటగా మూడో సారి కూడా విజయ్ సినిమా హిట్ అవుతుంది రజినీకాంత్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని అంటున్నారు. రజనీకాంత్ జైలర్ 2 సినిమా అక్టోబర్ 15న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. జైలర్ హిట్ తో ఈ సినిమాపై ఆసక్తి ఉన్నా తమిళ్ లో తప్ప ఇంకెక్కడా అంచనాలు అయితే లేవు. ఆ తెల్లారే అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ రణబాలి సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో అయితే కచ్చితంగా జైలర్ 2 కంటే రణబాలి సినిమానే పెద్ద హిట్ అవుతుందని, రజినీకాంత్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also See : Anaswara Rajan : తులాభారం పూజా కార్యక్రమంలో అనశ్వర రాజన్. ఫోటోలు వైరల్..
