High Budget Movies : భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పుడు కామన్.. 100 కోట్ల పైనే బడ్జెట్ పెట్టి సినిమాలు..
ఈ మధ్య కంటెంట్ మీదనమ్మకంతో చిన్నహీరోల మీద కూడా 100కోట్ల బడ్జెట్ పెడుతున్నారు.

Small Market Heros Doing Big Budget Movies
High Budget Movies : 100కోట్ల కలెక్షన్లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. కలెక్షన్లు కాదు బడ్జెటే 100కోట్లు మినిమం అయిపోయింది ఇప్పుడు. బాలకృష్ణ దగ్గరనుంచి విజయ్ దేవరకొండ వరకూ ఇప్పటి వరకూ 100కోట్ల బడ్జెట్ దాటని హీరోలు కూడా 100కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. స్పెషల్లీ బాలకృష్ణ అయితే ఈసారి అఖండ 2కి దాదాపు 200కోట్ల బడ్జెట్ తో గ్రాండ్ గా సినిమా చేస్తున్నట్టు టాక్. బాలయ్య, బోయపాటి, స్టార్స్ కే రెమ్యూనరేషన్లకే దాదాపు 80 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్టు. మిగిలింది ప్రొడక్షన్ అని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేసుకుని గ్రాండ్ గా విజువల్ వండర్ గా తెరకెక్కబోతోంది అఖండ2. అందుకే ఈసారి పాన్ ఇండియా స్టాండర్డ్స్ కి తగినట్టే సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు.
విజయ్ దేవరకొండకి అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి, గీతగోవిందం తప్ప ఇప్పటి వరకూ పట్టుమని హిట్ అయిన సినిమాలేదు. అయినా సరే మేకింగ్ లో ఏమాత్రం తగ్గేదే లేదంటున్నారు నిర్మాతలు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కింగ్ డమ్ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే దాదాపు 100కోట్లతోనే రాబోతోందని టాక్. సితార,శ్రీకర, ఫార్చ్యూన్ ఫోర్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ కింగ్ డమ్ మూవీభారీ యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి ఈసారి ఎలా అయినా పాన్ ఇండియా వైడ్ సత్తా చూపించాలి కాబట్టి విజయ్ దేవరకొండపై ఈ రేంజ్ బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్.
Also Read : Chhaava – NTR : సూపర్ హిట్ సినిమా ‘ఛావా’ కోసం ఎన్టీఆర్.. ఇదే కనక నిజమైతే..
చిన్న హీరోల మీద బడ్జెట్ పెట్టడానికి భయపడతారు నిర్మాతలు. ఎందుకంటే వాళ్లకంత మార్కెట్ ఉండదు కాబట్టి. బడ్జెట్ పెడితే కలెక్షన్లు రాబట్టడం కష్టం. అయితే ఈమధ్య కంటెంట్ మీదనమ్మకంతో చిన్నహీరోల మీద కూడా 100కోట్ల బడ్జెట్ పెడుతున్నారు.
మొన్న మొన్నటి వరకూ చిన్న హీరోగానే ఉన్న నిఖిల్ ని 100కోట్లకు పైగా కలెక్షన్లతోపాన్ ఇండియా హీరోని చేసింది కార్తికేయ2 మూవీ. ఒక్క సినిమా హిట్ అయినంత మాత్రాన ప్రతీ సినిమా అదే రేంజ్ లో కలెక్షన్లు రాబట్టలేదు. అందుకే కార్తికేయ2 కమర్షియల్ గా రికార్డులు సెట్ చేసినా తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆడలేదు. అయినా సరే అప్ కమింగ్ మూవీ స్వయంభు ని మాత్రం భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ని దాదాపు 120కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు.
Also Read : Ram Pothineni : షూటింగ్లో హీరో రామ్ ని కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి.. రామ్ కొత్త లుక్ వైరల్..
సాయిధరమ్ తేజ్.. విరూపాక్ష తో 100కోట్ల కలెక్షన్లు సాధించిన హీరోగా పేరు తెచ్చుకున్న ఈ మెగా హీరో కూడా తన మార్కెట్ ని మించి ఈ సారి బడ్జెట్ పెడుతున్నారు. సాయిదరమ్ తేజ్ తన అప్ కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టు సినిమాని ఏకంగా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో చేస్తున్నారు. రోహిత్ డైరెక్షన్లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా హై ఆక్టేన్ యాక్షన్ మూవీ కాబట్టి అంత బడ్జెట్ ఉండాల్సిందే అంటోంది టీమ్.
ఇంట్రస్టింగ్ కంటెంట్ తో సినిమాలు చేస్తున్నా కమర్షియల్ గా చెప్పుకోదగ్గ హిట్ ఇవ్వని చిన్న హీరో తేజసజ్జాని పాన్ ఇండియా హీరోని చేసింది హనుమాన్ మూవీ. 40కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ మూవీ 350 కోట్ల కలెక్షన్లతో దుమ్ము లేపింది. అయితే ప్రతి సారీ ఈ రేంజ్ కలెక్షన్లు వస్తాయన్న నమ్మకం లేదు. అయినా సరే తేజసజ్జా మీద దాదాపు 100కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా చేస్తున్నారు మిరాయ్ మూవీ నిర్మాతలు. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ కి రిలీజ్ పోస్ట్ చేసుకున్నట్టు లేటెస్ట్ గా అనౌన్స్ చేసింది టీమ్.
100 కోట్ల కలెక్షన్లు కాదు కదా పట్టుమని 20, 30 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టలేదు మంచు విష్ణు ఇప్పటి వరకూ. అలాంటి మంచు విష్ణు తన అప్ కమింగ్ మూవీ కన్నప్ప ని 150 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, మోహన్ బాబు, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్.. లాంటి చాలా మంది స్టార్స్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు ఈ సినిమాలో. శివుడి అపర భక్తుడు కన్నప్ప గా మంచు విష్ణు కనిపించబోతున్నారు. మోహన్ లాల్ ,ప్రభాస్ లాంటి వాళ్లు రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమా చేస్తున్నా కూడా 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారంటే సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కుతోందో అనుకుంటున్నారు ఆడియన్స్. ఇలా అసలు మార్కెట్ లేకపోయినా కలెక్షన్లు లేకపోయినా100కోట్లు ఉండాల్సిందే అన్న రేంజ్ లో బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తున్నారు. మరి వీళ్లందరూ ఆ బడ్జెట్ ని కలెక్ట్ చేస్తారో లేదో చూడాలి.