Chhaava – NTR : సూపర్ హిట్ సినిమా ‘ఛావా’ కోసం ఎన్టీఆర్.. ఇదే కనక నిజమైతే..
ఛావా సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని, అందులో ఎన్టీఆర్ కూడా యాడ్ అవుతున్నారని తెలుస్తోంది.

NTR Will be Joining for Telugu Dabbing Chhaava Movie Rumors goes Viral
Chhaava – NTR : విక్కీ కౌశల్ , రష్మిక మందన్న కాంబినేషన్లో ఈ నెల 14న థియేటర్లోకొచ్చిన ఛావా సినిమా 300కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇదే స్పీడ్ లో వీకెండ్ కి 500కోట్లు దాటెయ్యడం కూడా గ్యారంటీ అంటున్నారు. నిజానికి ఈ సినిమాకి టాలీవుడ్ లో కూడా ప్రమోషన్లు చేసినా తెలుగులో మాత్రం రిలీజ్ చెయ్యలేదు టీమ్. అయితే ఇప్పుడు తెలుగులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని, అందులో ఎన్టీఆర్ కూడా యాడ్ అవుతున్నారని తెలుస్తోంది.
ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఛావా మూవీని టాలీవుడ్ జనాలు కూడా చూస్తున్నారు. మామూలుగానే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి తోడు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక రూమర్ వినిపిస్తుంది.
Also Read : Ram Pothineni : షూటింగ్లో హీరో రామ్ ని కలిసిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి.. రామ్ కొత్త లుక్ వైరల్..
ఛావా సినిమాలో విక్కీ కౌశల్ క్యారెక్టర్ కి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నాడంటూ రూమర్ వినిపిస్తోంది. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో, ఎమోషన్స్ ని పలికించడంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. అందుకే ఎన్టీఆర్ తో సినిమా డబ్ చేయించాలని టీమ్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా తన అప్ కమింగ్ బాలీవుడ్ ఎంట్రీ కోసం బాలీవుడ్ ని ఇంప్రెస్ చెయ్యొచ్చని అనుకుంటున్నట్టు టాక్.
Also Read : Anaganaga Teaser : మళ్ళీ వస్తున్న సుమంత్.. ‘అనగనగా’ టీజర్.. తెలుగు భాష ప్రేమికులు చూడాల్సిందే..
వార్ 2 తో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు విక్కీ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే గ్యారంటీగా బాలీవుడ్ కి కూడా హెల్ప్ అవుతుందని ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఛావా సినిమాకు ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెప్తున్నారా? నేడు అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చావాకు తెలుగులో కావాల్సినంత ఫ్రీ ప్రమోషన్ వస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చావా సినిమాకు వెళ్తారు.