విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్.. మోసపోవద్దంటూ ప్రకటన..

Vijay Deverakonda Team reacts on Rumours: సోషల్ మీడియా వినియోగం పెరిగేద్ది నేరాల సంఖ్య పెరిగిపోతోంది.. ఏదో రకంగా మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. సినిమా పరిశ్రమలో అవకాశాల పేరుతో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి.
హీరో, హీరోయిన్స్, డైరెక్టర్స్, నిర్మాణ సంస్థలు పేరిట ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి సినిమాల్లో ఛాన్స్ ఇస్తామంటూ పలువుర్ని మోసం చేయడం, బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం వంటి ఘటనలు చూశాం..
తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ ఇస్తామంటూ ప్రకటన వెలువడడం, ఆ విషయం విజయ్ అండ్ టీమ్ వరకు వెళ్లడంతో సోషల్ మీడియా వేదికగా ఆ వార్తలను ఖండిస్తూ అధికారిక ప్రకటన చేశారు.
వివరాళ్లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ నటించబోయే కొత్తసినిమాకు సంబంధించి ఆడిషన్స్ జరుగుతున్నాయని, అతనిపక్కన నటించే ఛాన్స్ ఇస్తామంటూ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.. దీంతో విజయ్ దేవరకొండ టీమ్ రియాక్ట్ అయింది. విజయ్ నటిస్తున్న కొత్త సినిమా వివరాల్ని ఆయన కానీ నిర్మాతలు గానీ ప్రకటిస్తారు.. విజయ్ దేవరకొండ పేరుని దుర్వినియోగం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.