‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్

  • Published By: veegamteam ,Published On : April 8, 2019 / 07:24 AM IST
‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్ సాంగ్ రిలీజ్

Updated On : April 8, 2019 / 7:24 AM IST

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. గీత గోవిందం లాంటి హిట్ సినిమా తరువాత ఇద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.  

తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ‘నీ నీలి కన్నుల్లోన’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా.. రెహమాన్ లిరిక్స్ అందించారు. గౌతమ్ భరద్వాజ్ తన వాయిస్‌తో ప్రాణం పోశారు. ఈ పాట సంగీత ప్రియులను కచ్చితంగా అలరిస్తుంది. అంతేకాదు తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో ఈ సాంగ్ రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ పాటను గౌతమ్ భరద్వాజ్ ఆలకించడం విశేషం.