Yuvan Shankar Raja – Vijay : విజయ్ ఫ్యాన్స్ వల్ల.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీ యాక్టివేట్ చేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..? క్లారిటీ ఇస్తూ..

‘ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ సినిమా సాంగ్ బాగోలేదంటూ విజయ్ అభిమానులు యువన్ శంకర్ రాజాని విమర్శిస్తూ పోస్టులు చేసారు.

Yuvan Shankar Raja – Vijay : విజయ్ ఫ్యాన్స్ వల్ల.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీ యాక్టివేట్ చేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..? క్లారిటీ ఇస్తూ..

Vijay Fans Targeted Music Director Yuvan Shankar Raja over The Greatest of All Time song

Updated On : April 18, 2024 / 4:50 PM IST

Yuvan Shankar Raja – Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’(The Greatest Of All Time) సినిమా చేస్తున్నాడు. AGS ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో విజయ్ 68వ సినిమాగా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇటీవల ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ సినిమా నుంచి విజిల్ పోడు అనే సాంగ్ ని విడుదల చేశారు.

ఈ సాంగ్ పై భారీగా విమర్శలు వచ్చాయి. ఈ సాంగ్ బాగోలేదంటూ విజయ్ అభిమానులు యువన్ శంకర్ రాజాని విమర్శిస్తూ పోస్టులు చేసారు. యువన్ ని తీసేసి అనిరుధ్ కి ఇవ్వండి మ్యూజిక్ అంటూ కామెంట్స్ చేసారు. సోషల్ మీడియాలో యువన్ శంకర్ రాజాని ట్యాగ్ చేస్తూ ట్రోల్స్ చేసారు విజయ్ ఫ్యాన్స్. యువన్ సోషల్ మీడియా అకౌంటీకి రిపోర్టులు కూడా కొట్టారని సమాచారం. అయితే ఇవాళ ఉదయం నుంచి యువన్ శంకర్ రాజా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనపడట్లేదు. విజయ్ ఫ్యాన్స్ చేసిన ట్రోలింగ్ కి తట్టుకోలేకే యువన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని తీసేశాడని వార్తలు వినిపించాయి.

Also Read : Sandeep Reddy Vanga : నిన్ను నా సినిమాలో పెట్టుకున్నందుకు సిగ్గుపడుతున్నాను.. నటుడిపై సందీప్ రెడ్డి వంగ కామెంట్స్..

తాజాగా కొద్దిసేపటి క్రితం యువన్ శంకర్ రాజా దీనిపై స్పందిస్తూ ట్విట్టర్లో ట్వీట్ వేసాడు. యువన్ శంకర్ రాజా తన ట్వీట్ లో.. మీ అందరూ నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోయినందుకు స్పందిస్తూ మెసేజ్ లు చేసినందుకు థ్యాంక్యూ. ఇది కేవలం టెక్నికల్ ఎర్రర్ మాత్రమే. నా టీం నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ని రీస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నా అకౌంట్ త్వరలోనే తిరిగి వస్తుంది అని తెలిపాడు. అయితే విజయ్ ఫ్యాన్స్ వల్లే యువన్ సోషల్ మీడియా అకౌంట్ పోయిందని, అయినా ఇలా కూల్ గా స్పందించాడని విజయ్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.