Leo Collections : ‘లియో’ సరికొత్త రికార్డ్.. నాలుగు రోజుల్లోనే 400 కోట్లు.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే..
మొదటి రోజే లియో సినిమా 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్స్ సెట్ చేసింది.

Vijay Lokesh Kanagaraj Leo Movie Four Days Collections
Leo Collections : లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్(Vijay) హీరోగా ఇటీవల లియో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఉంటుంది అని తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే లియో సినిమా విజయ్ అభిమానులని మెప్పించినా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులని మాత్రం నిరాశ పరిచింది. అలాగే తమిళనాడు బయట లియో సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ దసరా హాలీడేస్ ఉండటంతో, తమిళ్ లో కేవలం ఒక్క సినిమానే రిలీజ్ అవ్వడంతో కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి.
మొదటి రోజే లియో సినిమా 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్స్ సెట్ చేసింది. ఇక లియో సినిమా నాలుగు రోజుల్లోనే 403 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని పలువురు షేర్ చేయగా చిత్ర నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గురువారం సినిమా రిలీజవ్వగా ఆదివారం వరకు ఈ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఇంకా పండగ హాలిడేస్ ఉండటంతో మరిన్ని కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నారు.
Also Read : Upasana : అనాథ పిల్లలు, మహిళలతో ఉపాసన బతుకమ్మ వేడుకలు.. క్లీంకారతో కలిసి.. మెగాఫ్యామిలిలో పండగ సందడి..
ఇక అమెరికాలో కూడా లియో సినిమా 2 మిలియన్ డాలర్స్ దాటేసింది. యూకేలో కూడా 1 మిలియన్ యూరోలు దాటేసింది. ఇక లియో సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 250 కోట్లకు పైగా జరిగింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 260 కోట్ల షేర్ కలెక్షన్స్, అంటే 520 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాలి. ఇప్పటికే 400 కోట్లు సాధించగా మిగిలింది కూడా మరో రెండు, మూడు రోజుల్లోనే వచ్చేస్తుందని భావిస్తున్నారు సినిమా ట్రేడ్ వర్గాలు. ఇక తెలుగులో కూడా ఈ సినిమా దాదాపు ఇప్పటికే 25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం.
#LEO is the first Tamil to be reported in the Global Comscore website ?
₹400 Cr Worldwide ($48.5 Mn)#LeoHits400crores in Just 4 Days#Thalapathy @actorvijay @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay @akarjunofficial @7screenstudio @Jagadishbliss… pic.twitter.com/ODAioCP0fu
— RIAZ K AHMED (@RIAZtheboss) October 23, 2023
I wanna hear you say 'Leo Leo Leo Leo' ?#LEO 4 Days worldwide gross collection is 405.5 crores+ ?
HIGHEST WEEKEND WORLDWIDE COLLECTION EVER FOR A TAMIL FILM??#LeoHits400crores ?#BlockbusterLeo ?#LeoIndustryHit ? pic.twitter.com/Ahf1IQ4h12
— Ahimsa Entertainment (@AhimsaFilm) October 23, 2023