Ram Charan : రామ్‌చరణ్‌కి ప్రత్యేకంగా ‘వరిసు’ ప్రీమియర్ వేయించిన విజయ్..
తమిళ స్టార్ హీరో విజయ్, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన చిత్రం 'వరిసు'. కాగా చిత్ర యూనిట్ కంటే ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా 'వరిసు' ప్రీమియర్ వేయించాడంటా విజయ్. RC15కి సంబంధించిన వర్క్స్ కోసం చెన్నైలోని థమన్ ఆఫీస్ కి రామ్ చరణ్...

Vijay premiered Varisu exclusively for Ram Charan
Ram Charan : తమిళ స్టార్ హీరో విజయ్, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘వరిసు’. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో జయసుధ, కుష్బూ, సంగీత, శరత్ కుమార్, ప్రభు, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తుంది.
Ram Charan : కొండారెడ్డి బురుజు దగ్గర చరణ్.. ఫ్యాక్షన్ కాదు యాక్షన్..
ఇక విషయానికి వస్తే.. చిత్ర యూనిట్ కంటే ముందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా ‘వరిసు’ ప్రీమియర్ వేయించాడంటా విజయ్. RC15కి సంబంధించిన వర్క్స్ కోసం చెన్నైలోని థమన్ ఆఫీస్ కి రామ్ చరణ్ వెళ్లడం జరిగింది. ఆ సమయంలో దిల్ రాజు, విజయ్ కి కాల్ చేసి.. “చరణ్ కి మన సినిమా చూపించ వచ్చా?” అని అడగడంతో విజయ్ తప్పకుండా అంటూ ఓకే చెప్పాడు.
దీంతో దిల్ రాజు, చరణ్‌కి వరిసు ప్రీమియర్ వేసి చూపించాడు. సినిమా చూసిన రామ్ చరణ్ మూవీ టీంని గొప్పగా ప్రశంసించాడట. దీంతో మూవీ టీం ఫుల్ జోష్‌లో ఉందట. కాగా ఈ సినిమా మొదటిగా చరణ్ తో చేయాల్సి ఉందని దిల్ రాజు చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్, దిల్ రాజు నిర్మాణంలోనే RC15 చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
— ℝ???? ? ℝℂ ? (@im_RCult) January 2, 2023