Vijay Devarakonda : రష్మిక నా డార్లింగ్.. తనంటే నాకు చాలా ఇష్టం అంటున్న విజయ్ దేవరకొండ..

ఈ షోలో విజయ్‌ని రష్మికతో డేటింగ్‌ చేస్తున్నావట అని కరణ్ అడగగా, విజయ్ మాట్లాడుతూ.. ''రష్మిక నా డార్లింగ్‌. నా కెరీర్‌ మొదట్లోనే రష్మికతో రెండు సినిమాలు చేశాను. షూటింగ్‌ సమయంలో..........

Vijay Devarakonda : రష్మిక నా డార్లింగ్.. తనంటే నాకు చాలా ఇష్టం అంటున్న విజయ్ దేవరకొండ..

Vijay Rashmika

Updated On : July 30, 2022 / 10:31 AM IST

Vijay Devarakonda :  బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఇటీవలే మొదలైంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ పూర్తవగా నాలుగో ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే గెస్టులుగా వచ్చారు. హాట్ స్టార్ లో రిలీజైన ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఇందులో విజయ్, అనన్య చాలా విషయాలు షేర్ చేశారు. పర్సనల్ విషయాల గురించి కూడా కరణ్ అడిగాడు.

ఈ షోలో విజయ్‌ని రష్మికతో డేటింగ్‌ చేస్తున్నావట అని కరణ్ అడగగా, విజయ్ మాట్లాడుతూ.. ”రష్మిక నా డార్లింగ్‌. నా కెరీర్‌ మొదట్లోనే రష్మికతో రెండు సినిమాలు చేశాను. షూటింగ్‌ సమయంలో మేం మంచి స్నేహితులమయ్యాం. మేమిద్దరం కెరీర్‌, జీవితంలోని కష్టసుఖాల గురించి మాట్లాడుకుంటాం. మా మధ్య మంచి బాండింగ్‌ ఉంది. తనంటే నాకు చాలా ఇష్టం. తాను నా డార్లింగ్” అని చెప్పడంతో విజయ్, రష్మిక ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ చేస్తున్నారు.

Tanushree Dutta : నాకేమన్నా అయితే నానా పటేకర్‌, బాలీవుడ్‌ మాఫియానే కారణం

అనన్యని కూడా విజయ్ లవ్ గురించి అడగడంతో అనన్య.. హీ ఈజ్‌ ఇన్‌ ‘రష్‌’ ఫర్ మీట్ మీకా.. మీకా సింగ్‌ అని సాగదీస్తూ చెప్పింది. కరణ్ దీనికి సమాధానంగా.. ఓ రష్-మిక అని రష్మిక పేరు వచ్చేలా అన్నారు. అనన్య ఇలా ఇండైరెక్ట్ గా చెప్తూ రష్మిక, విజయ్ మధ్య ఉన్న బంధం గురించి తెలిపింది. దీంతో రష్మిక, విజయ్ మధ్య నిజంగానే ఏదో నడుస్తుంది అన్న వార్తలకి మరింత బలం చేకూరింది. మరి దీనిపై రష్మిక స్పందిస్తుందేమో చూడాలి.