Vijay Thalapathy: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’తోనే పోటీ పడుతానంటున్న తమిళ హీరో..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కలయికలో తెరకెక్కుతున్న బైలింగువల్ మూవీ "వారసుడు". శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. నేటి నుంచి లాస్ట్ షెడ్యూల్ లో పాల్గొనుంది చిత్ర యూనిట్. రెండు యాక్షన్ సీక్వెన్స్ అండ్ రెండు సాంగ్స్ తో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయనుండగా...

Vijay Thalapathy: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’తోనే పోటీ పడుతానంటున్న తమిళ హీరో..

Vijay Thalapathy Varasudu Movie Update

Updated On : September 25, 2022 / 9:30 AM IST

Vijay Thalapathy: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కలయికలో తెరకెక్కుతున్న బైలింగువల్ మూవీ “వారసుడు”. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక విజయ్ దళపతి నటిస్తున్న మొదటి తెలుగు స్ట్రెయిట్ మూవీ ఇది.

Thalapathy Vijay: హాట్ టాపిక్.. హీరో విజయ్-పుదుచ్చేరి సీఎం భేటీ!

నేటి నుంచి లాస్ట్ షెడ్యూల్ లో పాల్గొనుంది చిత్ర యూనిట్. రెండు యాక్షన్ సీక్వెన్స్ అండ్ రెండు సాంగ్స్ తో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయనుండగా, సంక్రాంతి బరిలో కచ్చితంగా నిలవబోతున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. కాగా సంక్రాతికి ప్రభాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ కూడా విడుదల కాబోతుంది. మరి విజయ్, ప్రభాస్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వగలడో చూడాలి.

భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాతంకంగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా, విజయ్ కు జంటగా నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తుంది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, కుష్బూ, శరత్ కుమార్, ప్రభు వంటి భారీ తారాగణం ఈ సినిమాలో మెరవనున్నారు. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.