Vaarasudu: సెన్సార్ పనులు ముగించుకున్న వారసుడు..!

తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు తెలిపింది. ఇక ఈ సినిమా తెలుగు రిలీజ్ విషయంతో దిల్ రాజు ఇవాళ ఓ క్లారిటీ ఇచ్చారు.

Vaarasudu: సెన్సార్ పనులు ముగించుకున్న వారసుడు..!

Vijay Vaarasudu Completes Censor Works

Updated On : January 9, 2023 / 7:47 PM IST

Vaarasudu: తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు తెలిపింది. ఇక ఈ సినిమా తెలుగు రిలీజ్ విషయంతో దిల్ రాజు ఇవాళ ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ‘వారసుడు’ టైటిల్‌తో జనవరి 14న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఆయన తెలిపారు.

Vijay Vaarasudu: వారసుడు అప్పుడే ముగిస్తాడట.. ఆ తరువాత..?

అయితే ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న సినిమాగా వారసుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారట. ఇక ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లో మలిచిన తీరు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాలో విజయ్ నటన అభిమానులకు ఫుల్ మీల్స్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

Vaarasudu: వారసుడు ఎంట్రీ ఇచ్చేది ఆ ఓటీటీలోనే!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రీకాంత్, జయసుధ, ప్రకాశ్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలకు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాతో విజయ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి జనవరి 14న రిలీజ్ అవుతున్న వారసుడు మూవీకి జనాలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.